Allu Arjun: 6 ఏళ్ల తరువాత.. కొత్త లుక్ లో అల్లు అర్జున్.. బన్నీ ఫోటోలు వైరల్..

Allu Arjun New Look: సినిమాల కోసం నటులు తమ పాత్రలకు తగినట్లు తమ ఆహార్యాన్ని మార్చుకుంటారు. అవసరమైతే.. బరువు పెరగడం లేదా తగ్గడం, లాంగ్ హెయిర్ లేదా గడ్డం పెంచుకోవడం ఇలా తమ పాత్రకు సెట్ అయ్యేలా తమ రూపాన్ని మార్చుకుంటారు. అలా అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమా కోసం తన స్టైలిష్ లుక్ ను పూర్తిగా మార్చేసుకున్నాడు. పుష్ప సినిమాలోని 'పుష్ప రాజ్' పాత్ర కోసం పొడవాటి జుట్టు గడ్డం పెంచుకున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు ఆరు సంవత్సరాల పాటు ఈ లుక్ ను మెంటైన్ చేశాడు అల్లు అర్జున్. తాజాగా అల్లు అర్జున్ నయా లుక్ లో కనిపించారు.

అల్లు అర్జున్ గత ఆరు సంవత్సరాలుగా ఏ ఈవెంట్ కి వెళ్ళినా.. ఏ ప్రోగ్రాం కి అటెండ్ అయినా ఈ గెటప్ లోనే కనిపించారు. పుష్ప 1 షూటింగ్ 2019లో ప్రారంభం కాగా.. ఈ సినిమా 2021 డిసెంబర్ 17న రిలీజ్ అయింది. దాదాపు 200 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా..ఎవరు ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 400 కోట్ల వరకు వసూలు చేసి నయా రికార్డును క్రియేట్ చేసింది. సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా ఊహించని రీతిలో రెస్పాన్స్ రావడంతో మూవీ మేకర్స్ కూడా షాక్ అయ్యారు.

Icon Star Allu Arjun New Look after six long years pics Viral

దీంతో పుష్ప సినిమా కు సీక్వెల్ గా పుష్ప 2 సినిమాను కూడా తెరకెక్కించారు. భారీ బడ్జెట్ తో రూపొందించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై .. కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పుష్ప గాడు తన ఏకచత్రాధిపత్యాన్ని ప్రదర్శించాడు. ఇప్పటివరకు రూ. 1799 కోట్ల గ్రాస్ బస్సులు చేసింది. తెలుగులో అత్యధికంగా వసూలు సాధించిన బాహుబలి 2 ( రూ. 1810 కోట్లు) సినిమా రికార్డును బ్రేక్ చేయడానికి పరుగులు తీస్తుంది. త్వరలోనే ఈ రికార్డు కూడా బ్రేక్ కాబోతోందని ట్రేడ్ వర్గాలు అంచన వేస్తున్నాయి.

ఇదిలా ఉంటే .. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అని మహిళ ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఆమె కుమారుడు తీవ్ర గాయాలపాలై ప్రస్తుతం ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై సీరియస్ అయ్యింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీంతో సంధ్యా థియేటర్ యజమాన్యం, పుష్ప హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. ఈ తరుణంలో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. దీంతో ఆయన తరుపు లాయర్లు హైకోర్టును ఆశ్రయించగా.. మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మర్నాడు ఉదయం జైలు నుండి విడుదలయ్యాడు.

అయితే అల్లు అర్జున్ బెయిల్ గడువు నిన్నటితో ముగియడంతో నాంపల్లి సిటీ స్పెషల్ కోర్టులో వర్చువల్ గా హాజరయ్యారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఈ బెయిల్ కండిషన్స్ ప్రకారం పూచీకత్తు ఇవ్వడానికి.. నేడు (శనివారం) నాంపల్లి కోర్టు కోర్టుకు వెళ్లారు. ఈ తరుణంలో అల్లు అర్జున్ న్యూ లూక్ లో కనిపించారు. బన్నీ జుట్టు కత్తిరించుకోవడంతోపాటు గడ్డం కూడా ట్రిమ్ చేశారు. ఇలా అల్లు అర్జున్ బయటికి రావడంతో ఆయన లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఫ్యాన్స్ తమ అభిమాన నటుడి ఫొటోస్ ను షేర్ చేస్తూ తమకు నచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: allu arjun pushpa 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X