Don't Miss!
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
Allu Arjun: చేతిలో పైప్.. మొదటిసారి ఊహించని లుక్ లో ఐకాన్ స్టార్ అరాచకం
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా అనంతరం ఐకాన్ స్టార్ గా మారిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా సక్సెస్ అనంతరం బన్నీ బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగిపోయింది. గతంలో ఎప్పుడు లేని విధంగా బన్నీ ఇప్పుడు నేషనల్ లెవెల్ లో కొన్ని ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నాడు. ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ ఒక సరికొత్త లుక్ లో కనిపించాడు. ఆస్ట్రల్ పైప్స్ కు ప్రచారకర్తగా ఇటీవల అగ్రిమెంట్ చేసుకున్న బన్నీ నెవ్వర్ బిఫోర్ అనే లుక్ తో చేతిలో పైప్ పట్టుకొని దర్శనమిచ్చాడు.
రింగుల జుట్టుతో బన్నీ కాస్త హై వోల్టేజ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఇక ఆ ఫొటో ఇంటర్నెట్ ప్రపంచంలో విడుదలైన కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయ్యాయి. ఇక ఈ యాడ్ లో నటించేందుకు బన్నీ భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఆ షార్ట్ వీడియో మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది. ఇక ఈ బ్రాండ్ తో పాటు త్రివిక్రమ్ డైరెక్షన్ లోనే మరో ప్రముఖ యాడ్ కంపెనీకి కూడా బన్నీ యాడ్ షూట్ నిర్వహించడం జరిగింది.
ఏదేమైనా ఐకాన్ స్టార్ కు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొన్ని ప్రముఖ కంపెనీలు భారీ స్థాయిలో రెమ్యునరేషన్స్ ఆఫర్స్ చేస్తున్నాయి. సినిమాలతోనే కాకుండా అల్లు అర్జున్ ఈ తరహాలో భారీగా ఆదాయాన్ని పెంచుకుంటున్నాడు. ఇక పుష్ప సెకండ్ పార్ట్ రెగ్యులర్ షూట్ ఆగస్టు నెలలో స్టార్ట్ కానున్న విషయం తెలిసిందే. దాదాపు 350 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో పుష్ప సెకండ్ పార్ట్ ను తెరపైకి తీసుకు రానున్నారు. ఇక షెడ్యూల్ ప్రకారం సినిమాను వచ్చే ఏడాది డిసెంబర్ లో లేదా 2024 జనవరిలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. మరి ఆ సినిమాతో బన్నీ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.