twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Allu Arjunకు ప్రతిష్టాత్మక గోల్డెన్ వీసా.. టాలీవుడ్ తొలి హీరోగా రికార్డ్, పదేళ్లపాటు దుబాయ్ లో!

    |

    ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన డ్యాన్స్, యాక్టింగ్ తో తెలుగు రాష్ట్రాల ప్రజల్లో స్టైలిష్ స్టార్ గా ఎంతోకాలంగా ముద్ర వేసుకున్నాడు. ఇటీవల పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. అలాగే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఈ సినిమాలో బన్నీ నటన, స్వాగ్, డైలాగ్స్, డ్యాన్స్ స్టెప్పులకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఎంతలా అంటే నార్త్ ప్రజలేకాకుండా విదేశీయులు కూడా వాటిని రీల్స్, రీక్రియేట్ చేసేలా చేశాయి. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న 'పుష్ప: ది రూల్'పై అనేక అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగినట్లుగానే ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించనున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం దక్కింది.

    ఏకంగా 7 అవార్డులు..

    ఏకంగా 7 అవార్డులు..

    గత కొంతకాలంగా పుష్ప రాజ్ హవా కొనసాగుతోంది. సౌత్, నార్త్, ఇంటర్నేషనల్ అని ఏ తేడా లేకుండా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరు మారుమోగిపోయింది. 2021లో వచ్చిన పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. పుష్ప రాజ్ నటనకు యావత్ ప్రపంచం బ్రహ్మరథం పట్టింది. పుష్ప సినిమాకు ఫిలీం ఫేర్ 67 అవార్డుల మహోత్సవంలో ఏకంగా 7 అవార్డులు రాగా, సైమా అవార్డులను వరించిన విషయం తెలిసిందే.

    తొలి దక్షిణాది నటుడిగా..

    తొలి దక్షిణాది నటుడిగా..

    అనంతరం అమెరికాలో గ్రాండ్ మార్షల్ గా వ్యవహరించిన అల్లు అర్జున్ కు ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా అందుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో గత 20 ఏళ్లలో ఉత్తరాది నుంచి దక్షిణ భారత నటుడుకి ఆ అవార్డు రావడం ఇదే తొలిసారి. ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్న తొలి దక్షిణాది నటుడిగా అల్లు అర్జున్ రికార్డుకెక్కాడు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం 'పుష్ప: ది రూల్'. దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది.

    విశాఖలో పది రోజులు..

    విశాఖలో పది రోజులు..

    పుష్ప 2 తాజా షెడ్యూల్ జనవరి 20న విశాఖలో స్టార్ట్ అయింది. హైదరాబాద్ నుంచి గురువారం రాత్రి బయలుదేరిన అల్లు అర్జున్ విశాఖపట్నం చేరుకున్నాడు. ఎయిర్ పోర్టులో అభిమానుల నుంచి బన్నీకి ఘన స్వాగతం లభించింది. ఎయిర్ పోర్టులో అల్లు అర్జున్ పొడవాటి జుట్టుతో కనిపించి ఆకట్టుకున్నాడు. సీక్వెల్ సినిమా కోసం బన్నీ కొత్త హెయిర్ స్టైల్ అని చర్చించుకుంటున్నారు. అయితే విశాఖలో పది రోజులు ఉండనున్న అల్లు అర్జున్ కి అరుదైన గౌరవం దక్కింది.

    దుబాయ్ గోల్డెన్ వీసా..

    దుబాయ్ గోల్డెన్ వీసా..

    తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి గోల్డెన్ వీసా జారీ అయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ పంచుకున్నాడు. యూఏఈ పభుత్వం ఈ గోల్డెన్ వీసాను అందిస్తుంది. తనకు గోల్డెన్ వీసా జారీ చేసిన దుబాయ్ ప్రభుత్వానికి బన్నీ ధన్యవాదాలు తెలిపాడు. ప్రముఖ నటులు, వైద్యులు, వాణిజ్య వేత్తలు, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు 2019 నుంచి ఈ గోల్డెన్ వీసాను అందిస్తోంది దుబాయ్ ప్రభుత్వం.

    గోల్డెన్ వీసా ప్రత్యేకతలు..

    గోల్డెన్ వీసా ప్రత్యేకతలు..

    దుబాయ్ ప్రభుత్వం అందించే ఈ గోల్డెన్ వీసాతో యూఏఈ రాజధాని అబుదాబీ లేదా దుబాయ్ తదితర ఎమిరేట్స్ లో పదేళ్ల వరకు నివసించవచ్చు. విదేశీయులు వారి దేశంలో ఎక్కువ కాలం నివసించేందుకు వీలుగా దుబాయ్ ప్రభుత్వం 2019లో ఈ ధీర్ఘకాలిక వీసాను ప్రవేశపెట్టింది. మొదట్లో ఈ గోల్డెన్ వీసా గడువు ఐదేళ్ల వరకు ఉండేది. కానీ రెండేళ్ల క్రితం దాన్ని 10 సంవత్సరాల వరకు పొడగించారు. పదేళ్ల తర్వాత ఈ వీసా దానికదే రెన్యూవల్ అవుతుంది. ఈ గోల్డేన్ వీసా పొందినవారు వంద శాతం ఓనర్ షిప్ తో ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు కూడా నిర్వహించుకోవచ్చు.

    గోల్డెన్ వీసా అందుకున్నవారు..

    ఇక యూఏఈ ప్రభుత్వం నుంచి ఈ గోల్డెన్ వీసా అందుకున్న మొట్టమొదటి భారతీయ సెలబ్రిటీ బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్. అనంతరం సంజయ్ దత్, సానియా మీర్జా, కమల్ హాసన్, మమ్ముట్టీ, మోహన్ లాల్, సోనూ సూద్, మౌనీ రాయ్, బోనీ కపూర్, సంజయ్ కపూర్, వరుణ్ ధావన్, ఊర్వశీ రౌటేలా, సునీల్ శెట్టి, నేహా కక్కర్, ఫరా ఖాన్, రణ్ వీర్ సింగ్, ఉపాసన కొణిదెల, విక్రమ్, పూర్ణ, కాజల్ అగర్వాల్, మీనా, దుల్కర్ సల్మాన్, విజయ్ సేతుపతి ఇలా ఎంతోమంది ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. అయితే టాలీవుడ్ నుంచి ఏ హీరో ఈ వీసాను అందుకోలేదు. దీంతో గోల్డెన్ వీసా అందుకున్న తొలి హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేశాడు.

    English summary
    Icon Star And Pushpa 2 Actor Allu Arjun Received Golden Visa From UAE Government And Allu Arjun Is The Tollywood First Hero Who Get Golden Visa.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X