ప్రభాస్ సినిమాతో అల్లు అర్జున్ బిగ్ మల్టీప్లెక్స్ థియేటర్ ప్రారంభం.. ఎక్కడంటే?
ఇటీవల కాలంలో చాలామంది స్టార్ హీరోలు సినిమా ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టడానికి ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. ఒకప్పుడు హీరోగా చేసి రెమ్యునరేషన్ తీసుకుని సైలెంట్ గా ఉండే హీరోలు ఇప్పుడు నమ్మకంతో సినిమా ఇండస్ట్రీపై ఆధారపడిన సంస్థలతోనే బిజినెస్ చేస్తున్నారు. ఇక ఏషియన్ సినిమాస్ ప్రముఖ టాలీవుడ్ హీరోలతో మల్టీప్లెక్స్ లను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వారిని పార్ట్నర్ గా చేసుకుంటూ భారీ స్థాయిలో ఇప్పటికే కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్లను నిర్మించడం జరిగింది. ఇక త్వరలోనే అల్లు అర్జున్ కూడా ఈ బిజినెస్ లోకి అడుగు పెట్టబోతున్నాడు.
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కొత్త మల్టీప్లెక్స్‌ను గ్రాండ్ ఓపెనింగ్ చేయడంతో థియేటర్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాడు. ఎల్లప్పుడూ సందడిగా ఉండే అమీర్‌పేట జంక్షన్‌లో ఆ మల్టీప్లెక్స్ జూన్ 16న లాంచ్ కానుంది. మొదటగా భారీ అంచనాలున్న ప్రభాస్ ఆదిపురుష్ చిత్రంతో థియేటర్ మొదలు కానుంది. అమీర్‌పేటలోని సత్యం థియేటర్‌ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్, AAA సినిమాస్ (ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్) పేరుతో అత్యాధునిక మల్టీప్లెక్స్‌గా మార్చాడు.

మల్టీప్లెక్స్ ప్రవేశద్వారం వద్ద ఆకర్షణీయమైన ఒక విగ్రహాన్ని కలిగి ఉందని చెబుతున్నారు. లాంచ్ డేట్ సమీపిస్తున్న కొద్దీ ఫ్యాన్స్ ఆ థియేటర్ లో సినిమా చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 100కి పైగా LED స్క్రీన్‌లతో మల్టీప్లెక్స్‌లోని వివిధ మూలలను అలంకరించారట. సందర్శకులకు దృశ్యపరంగా అద్భుతంగా ఉంటుందట. అల్లు అర్జున్ థియేటర్ బిజినెస్‌లోకి అడుగుపెట్టడం ద్వారా ఇది తప్పకుండా వర్కౌట్ అవుతుందని తెలుగు చిత్ర పరిశ్రమ AAA సినిమాస్ ప్రారంభం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్ భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలోకి రాబోతున్న ఈ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


Click it and Unblock the Notifications











