ఎన్టీఆర్ కంటే చరణే ఎక్కువగా నమ్మాడట.. ఆ సినిమా అలా మిస్!

ప్రెజెంట్ పాన్ ఇండియా మార్కెట్ లో మంచి ఫేమ్ ఉ్నటువంటి అతి తక్కువమంది తెలుగు హీరోస్ లో పాన్ వరల్డ్ హిట్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ హీరోలు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లు కూడా ఒకరు. అయితే ఈ సినిమాతో ఈ ఇద్దరు టాప్ స్టార్స్ ఎంత మంచి స్నేహితులు అనేది కూడా అందరికీ ఒక క్లారిటీ వచ్చింది.

కానీ ఇప్పటికీ వీరి అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో తన్నుకు చస్తుంటారు. కాగా ఆ సినిమా తర్వాత ఇద్దరు హీరోస నుంచి కూడా భారీ సినిమాలు దేవర, గేమ్ ఛేంజర్ లు వచ్చాయి. మరి వీటిలో దేవర బాక్సాఫీస్ దగ్గర హిట్ అయితే గేమ్ ఛేంజర్ మాత్రం కేవలం 70 శాతం మేర మాత్రమే రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

if not jr ntr ram charan is first choice for this movie

అయితే ఈ ఇద్దరి హీరోస్ లో నటన పరంగా జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో సినిమాల్లో తన ప్రతిభ చూపించి ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. కానీ తారక్ కంటే లేట్ గా స్టార్ట్ చేసినప్పటికీ రామ్ చరణ్ కూడా ఒక నుడుగా ఊహించని షాక్ లు పలు సినిమాలతో అందించాడు. తనపై చాలా ట్రోల్స్ ఉన్నప్పటికీ రంగస్థలం సినిమాతో అందరి నోర్లు మూయించాడు ఆ తర్వాత RRR లో రామ రాజుగా లేటెస్ట్ గా గేమ్ ఛేంజర్ లో అప్పన్న పాత్రలో అయితే ఒదిగిపోయాడు.

ఇలా కొన్ని సినిమాల్లోనే లైఫ్ టైం రోల్స్ చరణ్ కి పడ్డాయి అంతే అద్భుతంగా తాను నటించాడు. అయితే చరణ్ అప్పన్నగా నత్తి ఉన్న పాత్రలో అమాయకంగా కనిపించే రాజకీయ నాయకునిగా సత్తా చాటితే తనకి ఇలాంటి రోల్ దీని కంటే ముందే పడాల్సి ఉందట. మరి ఎన్టీఆర్ కూడా చరణ్ లాంటి నత్తి ఉన్న పాత్రనే "జై లవకుశ" సినిమాలో చేసిన సంగతి తెలిసిందే.

if not jr ntr ram charan is first choice for this movie

అప్పట్లో తన పాత్రకి మంచి మార్కులు కూడా పడ్డాయి. కాగా ఈ సినిమా దర్శకుడు స్టేట్మెంట్ ఒకటి ఇపుడు బయటకి వచ్చింది. ఒకవేళ జై లవకుశ సినిమా ఎన్టీఆర్ కాకుండా ఏ హీరోతో చేస్తారు అనే ప్రశ్నకి తాను రామ్ చరణ్ ని ఎంచుకున్నారు. దీనితో మడు షేడ్స్ ఉన్న ఆ రోల్ కి రామ్ చరణ్ పొటెన్షియల్ ని ఎన్టీఆర్ తర్వాత నమ్మింది చరణ్ నే అని చెప్పవచ్చు.

కాగా అది మెటీరియల్ కానప్పటికీ అలాంటి నత్తి ఉన్న పాత్రతో గేమ్ ఛేంజర్ లో కనిపించి చరణ్ మెప్పించాడు. మరి ఇపుడు వస్తున్న ఈ ప్రశంసలు అంతా కొంచెం అప్పట్లోనే పరిస్థితులు అటు ఇటు అయ్యి ఉంటే కొన్నేళ్ల కితమే వచ్చి ఉండేవి అని చెప్పాలి. ఇక ఈ దర్శకుడు తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా డాకు మహారాజ్ మొన్న సంక్రాంతి కానుకగా రిలీజ్ కి రాగా బాలయ్య కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Read more about: ram charan game changer jr ntr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X