Jr.NTR రికార్డు.. దేశంలోనే మొట్టమొదటి కార్ ఆయన కోసమే వచ్చేసింది.. చూశారా?
మన సినిమా స్టార్లకు చాలామందికి కార్లంటే మహా పిచ్చి ఉంటుంది. మరీ ముఖ్యంగా తెలుగు స్టార్ల విషయానికి వస్తే బాలకృష్ణ మొదలు ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్ ఇలా కొందరు స్టార్ హీరోలు కార్లు మీద ఎక్కువ మోజు చూపిస్తూ ఉంటారు. అయితే తెలుగు విషయంలో అందరికంటే ముందుగా చెప్పుకోవాల్సింది ఎన్టీఆర్ గురించి. ఆయనకు కార్లు అంటే మహా పిచ్చి, అందుకే కార్ల మీద ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే కొన్న కార్లకు ఎక్కువగా 9999 వచ్చేలా ఫాన్సీ నెంబర్లు మీద కూడా ఆయన ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ పేరు కొత్తగా రికార్డుల్లోకి ఎక్కింది. దానికి కారణం ఆయన కొత్తగా ఆర్డరిచ్చి కొనుక్కున్న లాంబోర్గినీ కారు. అలా ఎలా జరిగింది ?

హీరోలకు కార్లంటే
నిజానికి ఖరీదైన కార్లను సేకరించడం మన హీరోలకు అలవాటే. టాలీవుడ్ హీరోలయిన ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి వారు కోట్ల విలువైన లగ్జరీ కార్లు కలిగి ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ అత్యంత ఖరీదైన లాంబోర్ఘినీ కారు కొన్నారని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే అప్పుడే ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చారు ఆయన పీఆర్వో ఇప్పుడు నిర్మాతగా మారిన మహేష్ కోనేరు. నిజానికి రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్న క్రమంలో వీరిద్దరి మధ్య క్లోజ్ నెస్ పెరుగుతుంది. ఈ విషయం ఆన్ స్క్రీన్ తో పాటు ఆఫ్ స్క్రీన్ లో కూడా కనిపిస్తోంది.

చరణ్ ఇంటి బయట
అయితే ఆ మధ్య రామ్ చరణ్ ఇంటి బయట ఒక లాంబోర్గినీ కార్ పార్క్ చేసి ఉండగా ఎన్టీఆర్ కొత్త లాంబోర్గినీ కారు కొని ఆ వెంటనే అదేసుకుని రామ్ చరణ్ ఇంటికి వెళ్ళాడని చెబుతూ చరణ్ ఇంటి బయట పార్క్ చేసిన ఉన్న ఆ కారు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వెంటనే ఈ లాంబోర్గినీ కారు జూనియర్ ఎన్టీఆర్ ది కాదని జూనియర్ ఎన్టీఆర్ పీఆర్వో మరియు నిర్మాత అయిన మహేష్ ఎస్ కోనేరు అప్పట్లోనే క్లారిటీ ఇచ్చారు.

ఆ కారు కాదని
లంబోర్ఘిని జూనియర్ ఎన్టీఆర్ కు చెందినది అని ఒక వెబ్‌సైట్ చేసిన ట్వీట్‌పై స్పందించిన మహేష్ కొనేరు "అది నిజం కాదు" అని ఆయన పేర్కొన్నారు. అప్పట్లోనే ఈ కారు జూనియర్ ఎన్టీఆర్ సొంతం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇక లాంబోర్ఘినీ యూరస్ కోసం ఎన్టీఆర్ టోకెన్ మొత్తాన్ని చెల్లించినది నిజమే. కానీ ఆ కారు డెలివరీ జరగాల్సి ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి.

భారతదేశంలో మొట్టమొదటి లంబోర్ఘిని ఉరుస్
ఇక తాజా సమాచారం మేరకు ఈ ఎన్టీఆర్ ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదటి లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ యొక్క యజమాని. ఇది అరోన్సియో అర్గోస్‌తో కాంట్రాస్ట్ కలర్‌తో నీరో నోక్టిస్ మాట్టేతో కూడా వస్తుంది. ఈ చిత్రాలను బెంగళూరుకు చెందిన ఆటో మొబిలియార్డెంట్ పోస్ట్ చేశారు. ఇక ఈ మోడల్ కారు ఆన్ రోడ్ ధర Rs.3.15 - 3.43 కోట్ల రూపాయలుగా ఉంది.

షూటింగ్ నిమిత్తం ఉక్రెయిన్‌లో
ఇక ఈ బీస్ట్ అందంగా మరియు కలర్ ఫుల్ గా కనిపిస్తోంది. అయితే ఈ కారు త్వరలో హైదరాబాద్ రానున్నట్టు చెబుతున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం RRR షూటింగ్ నిమిత్తం ఉక్రెయిన్‌లో ఉన్నారు. అత్యంత ఖరీదైన లాంబోర్ఘినీ యూరస్ అనే మోడల్ కారును ఎన్టీఆర్ కొన్ని నెలల కిందట బుక్ చేశారు. అయితే ఆ కారుకు ఉన్న డిమాండ్ కారణంగా డెలివరీ లేట్ అయింది.


Click it and Unblock the Notifications











