Allu Arjun: ఇన్‌స్టాగ్రామ్‌లో బన్నీ పర్సనల్ వీడియో.. ఇంట్లో అలా సెట్స్‌లో ఇలా.. తొలి ఇండియన్ హీరోగా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. కొంత కాలంగా ఇండియా వ్యాప్తంగా మారుమ్రోగిపోతోన్న పేర్లలో ఇది ఒకటి. అంతలా ఈ టాలీవుడ్ హీరో తనదైన టాలెంట్లతో నేషనల్ రేంజ్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా 'పుష్ప ది రైజ్' మూవీతో ప్రపంచం దృష్టిని తనవైపునకు తిప్పుకున్నాడు. అదే సమయంలో ఈ చిత్రానికి గానూ నేషనల్ అవార్డును అందుకుని సత్తా చాటాడు. దీంతో అతడి రేంజ్ మరింతగా పెరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్ టీమ్ అల్లు అర్జున్‌పై స్పెషల్ వీడియోను షేర్ చేసింది. దానిపై మీరు కూడా లుక్కేయండి మరి!
అవార్డు సాధించిన పుష్ప:అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందించిన మాస్ యాక్షన్ మూవీనే 'పుష్ప ది రైజ్'. ఎర్ర చందనం నేపథ్యంతో వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో భారీ స్థాయిలో విడుదలైంది. దీనికి అన్ని చోట్లా భారీ రెస్పాన్స్ వచ్చి సక్సెస్ అయింది. అంతేకాదు, పుష్ప చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించింది. ఇక, ఈ మూవీకి గానూ బన్నీ నేషనల్ అవార్డు సాధించాడు.

ఇన్‌స్టాగ్రామ్‌తో స్పెషల్‌గా:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు దేశ వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అతడికి సోషల్ మీడియాలో యమ క్రేజ్ ఏర్పడింది. దీంతో ఒక్క ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోనే అతడికి దాదాపు 22 మిలియన్ ఫాలోవర్లు వచ్చారు. దీనికితోడు ఇటీవలే నేషనల్ అవార్డు కూడా వచ్చింది. దీంతో ఇన్‌స్టాగ్రామ్ టీమ్ వాళ్లు అల్లు అర్జున్‌పై స్పెషల్ వీడియోను షేర్ చేశారు.

ఉదయాన్నే అలా చేస్తా:ఇన్‌స్టాగ్రామ్ టీమ్ గతంలో ఏ ఇండియన్ హీరోతో చేయని విధంగా అల్లు అర్జున్‌పై ఓ డాక్యూమెంటరీ టైప్ వీడియో చేసింది. దీన్ని తాజాగా షేర్ చేయగా.. అందులో బన్నీ ఉదయాన్నే నిద్ర లేచినప్పటి నుంచి ఏమేమి చేస్తాడో చూపించారు. ముఖ్యంగా మార్నింగ్ టైంలో అతడు యోగా చేయడం, గార్డెన్ ఏరియాలో వాకింగ్ చేయడం, ఆ తర్వాత కాఫీ తాగడం చూపించారు.

షూటింగ్‌కు వెళ్లేప్పుడు:ఉదయాన్నే అన్ని పనులు ముగించుకుని అల్లు అర్జున్ షూటింగ్‌కు వెళ్తాడట. తాజాగా అతడు 'పుష్ప ది రూల్' మూవీలో నటిస్తున్నాడు. ఇందులో పాల్గొనేందుకు రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లడాన్ని చూపించారు. అక్కడకు చేరుకునే సమయంలోనే బన్నీ తన పిల్లలకు వీడియో కాల్ చేసి మాట్లాడాడు. ఇలా ప్రతిరోజూ 1 గంటకు ఇంటికి కాల్ చేస్తానని అందులో చెప్పుకొచ్చాడు.
పుష్ప 2 కోసం బన్నీ రెడీ:ఇన్‌స్టాగ్రామ్ టీమ్ తాజాగా షేర్ చేసిన వీడియోలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీ షూటింగ్ కోసం సన్నద్ధం అయ్యే దాన్ని కూడా చూపించారు. ముఖ్యంగా అతడు షూటింగ్ స్పాట్‌లో తన అభిమానులను కలవడం, లొకేషన్‌లో ఉన్న సామాగ్రిని చూడడం, పుష్ప రాజ్‌గా మారడం కోసం మేకప్ వేసుకోవడం, ఆ తర్వాత షూటింగ్‌లో పాల్గొనడం వంటివి చూపించారు.

యాక్షన్ సీక్వెన్స్.. లుక్:తాజా వీడియోలో పుష్ప రాజ్ ఎర్ర చందనం దాచిన ఓ గొడౌన్‌కు వచ్చి.. వాటిని ఓ లారీలో లోడ్ చేయడాన్ని చూపించారు. దీనికోసం బన్నీ పలు టేక్‌లను తీసుకోవడం కూడా కనిపించింది. ఇక, దీని వల్ల 'పుష్ప 2'లో అల్లు అర్జున్ లుక్ కూడా రివీల్ అయింది. ఇందులోనే డైరెక్టర్ సుకుమార్ కూడా మాట్లాడాడు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయింది.


Click it and Unblock the Notifications











