Prabhas: సలార్‌లో అఖండ లాంటి పాయింట్.. యాక్షన్ లో డివోషనల్ టచ్?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇండియా సినిమాలపై అంచనాలు ఏ స్థాయిలో పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అందరి ఫోకస్ ఎక్కువగా అయితే సలార్ సినిమా పైనే ఉంది. KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరపైకి తీసుకు వస్తున్న ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అంశం కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. అఖండ తరహాలోనే సినిమాలో ఒక పాయింట్ హైలెట్ కాబోతున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

అంతకుమించి అనేలా
కేజిఎఫ్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్ల కలెక్షన్స్ వచ్చేలా చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పుడు ప్రభాస్ సలార్ సినిమాను అంతకుమించి అనేలా తెరపైకి తీసుకురాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ప్రతి ఒక్క అంశం కూడా హైలెట్ కాబోతోంది. అలాగే ప్రతి పాత్ర కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుందట. సినిమాలో శృతిహాసన్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

సలార్ పైనే ఆశలు
ప్రభాస్ ఇంతకుముందు చేసిన సాహో రాధే శ్యామ్ రెండు సినిమాలు కూడా తీవ్రంగా నిరాశపరిచాయి. ఇక ఇప్పుడు ఫ్యాన్స్ ఆశలు అన్నీ కూడా సలార్ సినిమా పైనే ఉన్నాయి. ఈ సినిమా కంటే ముందు ఆదిపురుష్ వస్తోంది కానీ దానిమీద కూడా కొంత నెగిటివిటీ ఉండడంతో ఇప్పుడు పూర్తిస్థాయిలో అయితే సలార్ సినిమా కోసమే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తప్పకుండా ఈ సినిమాలో ఫ్యాన్స్ కు నచ్చే హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ఉంటాయి అని చెప్పవచ్చు.

డివోషనల్ టచ్
అయితే సలార్ సినిమాకు సంబంధించి మరొక ఆసక్తికరమైన అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది. ఈ సినిమాలో కూడా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక డివోషనల్ టచ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అఖండ తరహాలో ఎలాగైతే బాలకృష్ణ డివోషనల్ టచ్ తో మెప్పించాడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ప్రభాస్ ఈ సినిమాలో క్లైమాక్స్ లో ఇవ్వబోయే డివోషనల్ టచ్ అద్భుతంగా ఉంటుందట.

కాళీ మాత బ్యాక్ గ్రౌండ్
సినిమాలో కాళికామాతకు సంబంధించిన కొన్ని అంశాలు కూడా పైలెట్ అవుతాయని తెలుస్తోంది. సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు కాళికామాత బ్యాక్ గ్రౌండ్ లోనే ఐ వోల్టేజ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తాయని టాక్ అయితే వినిపిస్తోంది. సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్రలో పృథ్వీరాజ్ కనిపించబోతున్నాడు. ఇక అతనే ప్రధాన విలన్ అని కూడా చెబుతున్నారు.

త్వరలోనే మరో అప్డేట్
అయితే సలార్ సినిమా రెండు భాగాలుగా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అది నిజమే అని కూడా అనిపిస్తోంది. దర్శకుడు ఇప్పటికే సెకండ్ పార్ట్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా షూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక మొదటి భాగాన్ని 2023 సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఇదివరకే అధికారికంగా తెలియజేశారు. ఇక ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











