హిట్టు కోసం మహేష్ సేఫ్ జోన్.. 'సర్కారు వారి పాట' అసలు స్టోరీ ఇదే!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా గ్యాప్ తరువత షూటింగ్ తో బిజీ కానున్నాడు. లాక్ డౌన్ కారణంగా 27వ సినిమాను ఆలస్యంగా స్టార్ట్ చేస్తున్న మహేష్ షూటింగ్ స్టార్ట్ చేస్తే ఆపకుండా వీలైనంత తొందరగా ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు. నెక్స్ట్ ఈ స్టార్ హీరో పరశురామ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా స్టోరీ గురించి కొన్ని కథనాలు వెలువడుతున్నాయి.

ప్లాప్ లేకుండా..

ప్లాప్ లేకుండా..

మహేష్ బాబు స్పైడర్, బ్రహ్మోత్సవం సినిమాల తరువాత చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టకపోయినా పరవాలేదు గాని డిజాస్టర్స్ మాత్రం కాకూడదని టార్గెట్ గా పెట్టుకున్నాడు. అందుకే భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నికేవ్వరు సినిమాలతో విజయాలను అందుకుంటూ సేఫ్ జోన్ లో వెలుతున్నాడు.

నెక్స్ట్ పరశురామ్..

నెక్స్ట్ పరశురామ్..

సరిలేరు నీకెవ్వరు సినిమా అనంతరం వంశీ పైడిపల్లితో సినిమా చేయాలని అనుకున్న మహేష్ ఊహించని విధంగా పరశురామ్ తో చేతులు కలిపాడు. గీత గోవిందం లాంటి సక్సెస్ అందుకున్న పరశురామ్ తప్పకుండా తనకు కూడా బాక్సాఫీస్ హిట్టిస్తాడాని మహేష్ నమ్ముతున్నాడు. లాక్ డౌన్ అనంతరం సినిమా మొదలుపెట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.

టైటిల్ అదేనా

టైటిల్ అదేనా

ఇకపోతే ఈ సినిమాకు సర్కారు వారి పాట అనే ఒక టైటిల్ సెట్ చేసినట్లు టాక్ వస్తోంది. మహేష్ చేసిన సినిమాల్లో ఇంతవరకుఏ సినిమాకు ఇలాంటి టైటిల్ సెట్ చేయలేదు. కానీ సినిమా కథకు కరెక్ట్ గా సెట్టవుతుందని దర్శకుడు చెప్పగానే మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఎండింగ్ లో ఉన్నాయి.

అసలు స్టోరీ ఇదే..

అసలు స్టోరీ ఇదే..

ఇకపోతే సినిమా అసలు స్టోరీ ఇదేనంటు సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాలకు సంబంధించిన విషయాలను సినిమాలో ఎక్కువగా చూపిస్తారట. సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి సందేశం కూడా ఉంటుందనే కామెంట్స్ వస్తున్నాయి. మరోసారి మహేష్ సేఫ్ జోన్ లోనే వెళుతున్నట్లు అర్ధమవుతోంది. మరి ఆ కాన్సెప్ట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X