విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ.. ఈ విధంగానా!
తిరుగులేని విజయాలు, విభిన్నమైన యాటిట్యుడ్ తో విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. అర్జున్ రెడ్డి చిత్రంతో యువత మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న విజయ్ దేవరకొండ, గీత గోవిందం చిత్రంతో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. అర్జున్ రెడ్డి చిత్రంతో అన్ని చిత్ర పరిశ్రమల్లో విజయ్ దేవరకొండ పేరు మారుమోగింది. బాలీవుడ్ బడా నిర్మాతల దృష్టిలో విజయ్ దేవరకొండ పడ్డాడు. విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ గురించి ఓ వార్త వైరల్ అవుతోంది.

బాలీవుడ్‌లో అవకాశం
ఈ ఏడాదిని టాక్సీవాలా చిత్ర విజయంతో ముగించిన విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాలపై దృష్టి పెట్టాడు. ప్రస్తుతం విజయ్ డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లో అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని విజయ్ గతంలో తెలిపాడు. తాజా సమాచారం ప్రకారం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఓ బాలీవుడ్ చిత్రంలో విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

కరణ్ జోహార్‌తో చర్చలు
విజయ్ దేవరకొండ తన బాలీవుడ్ ఎంట్రీ గురించి ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండే స్వయంగా చెబుతూ తాను కరణ్ జోహార్ ఇంటికి వెళ్లానని టాక్సీవాలా ప్రమోషన్స్ లో ప్రకటించాడు. అవకాశం ఉంటే అన్ని భాషల్లో నటిస్తానని తెలిపాడు. బాలీవుడ్ లో నటించాలని ఉందని చెప్పిన విజయ్ దేవరకొండ.. ప్రస్తుతానికి ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని తెలిపాడు.

నోటా చిత్రంలో తమిళంలో
గీత గోవిందం లాంటి భారీ విజయం తరువాత విజయ్ దేవరకొండ నోటా చిత్రంలో నటించాడు. ఈ చిత్రం ద్వారా విజయ్ దేవరకొండ కోలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. కానీ ఈ ప్రయత్నం ఫలితాని ఇవ్వలేదు. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ బాలీవుడ్ లోకి అడుగు పెట్టక ముందే మంచి క్రేజ్ ఏర్పడింది. అర్జున్ రెడ్డి చిత్రం హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నోట విజయ్ దేవరకొండ పేరు వినిపించడం కొసమెరుపు.

2020లో విడుదల
భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2020లో విడుదల చేస్తారట. అంటే విజయ్ దేవరకొండ బాలీవుడ్ లోకి నేరుగా హీరోగా కాకుండా అతిథిగా పరిచయం కాబోతున్నాడు. టాలీవుడ్ లో కూడా విజయ్ హీరో కాకముందు కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ అతిధిగా మెరవబోయే ఆ బాలీవుడ్ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.


Click it and Unblock the Notifications











