ఎన్టీఆర్ పాత్రలో రెండు షేడ్స్.. భారీ కాయంతో!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ గురించి విశేషాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. రాజమౌళి ప్రస్తుతం కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన ప్రతి వార్త అభిమానులని ఉత్కంఠకు గురిచేస్తోంది. ఆ మధ్యన ఎన్టీఆర్ షూటింగ్ నుంచి విరామం తీసుకుని దుబాయ్ వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ పాత్ర గురించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ అడవి దొంగగా నెగిటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడట. ఎన్టీఆర్ పాత్ర రెండు రకాల లుక్స్ లో సాగుతుందట. ఓ లుక్ లో ఎన్టీఆర్ సాధారణంగా కనిపించనున్నాడు. మరో లుక్ లో మాత్రం భారీ కాయంతో కనిపిస్తాడట. రాంచరణ్ బ్రిటిష్ ప్రభుత్వంలో పోలీస్ గా నటిస్తున్నాడు.

ఎన్టీఆర్, రాంచరణ్ పాత్ర మధ్య సంబంధం ఏంటనే ఉత్కంఠ ఇప్పటినుంచే అభిమానుల్లో ఎక్కువవుతోంది. స్వాతంత్ర ఉద్యమ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని వార్తలు వస్తున్నాయి. డివివి దానయ్య ఈ చిత్రాన్ని 300 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నారు. 2020లో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని విడుదలచేయాలనేది రాజమౌళి ప్లాన్.


Click it and Unblock the Notifications











