సాహో టీజర్ ఎప్పుడంటే.. అభిమానులకు ప్రభాస్ గిఫ్ట్!
ప్రభాస్ అభిమానులు సాహో చిత్రం కోసం కళ్ళకు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం 2019 లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సాహో చిత్రం గురించి ఎటువంటి విశేషాలు బయటకు రావడంలేదు. షూటింగ్ అప్డేట్స్ మాత్రమే బయటకు వస్తున్నాయి. అభిమానుల నిరీక్షణకు తెరదించాలని ప్రభాస్ అండ్ టీం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
దసరాకు అభిమానులకు గిఫ్ట్ గా చిన్న టీజర్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దసరా నుంచి పెద్ద చిత్రాల సందడి ప్రారంభం కానుంది. తన అభిమానులని నిరాశ పరచకుండా దసరాకు టీజర్ విడుదల చేయాలని ప్రభాస్ దర్శకుడు సుజీత్ కు సూచించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉండగా సాహో నెక్స్ట్ షెడ్యూల్ ముంబైలో జరగబోతోంది. ముంబైలో చిత్రీకరించే సన్నివేశాల విషయంలో ప్రభాస్ దర్శకుడికి కొన్ని మార్పులు సూచించినట్లు తెలుస్తోంది. ప్రభాస్ సూచించిన మార్పులు ఫినిష్ కాగానే ముంబై షెడ్యూల్ ప్రారంభం కానుందట.


Click it and Unblock the Notifications











