మెగా హీరో కొత్త సినిమా.. టైటిల్‌లో అసలు విషయం అదా!
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. తేజు నటించిన చిత్రాలు వరుసగా నిరాశపరుస్తున్నాయి. అర్జంటుగా తేజకు ఓ హిట్ అవసరం. ఇటీవల విడువులైన తేజు ఐ లవ్ యు చిత్రం నిరాశపరిచింది. తదుపరి చిత్రం విషయంలో ప్లానింగ్ తో ముందుకు వెళ్లాలని తేజు భావిస్తున్నాడు.
సాయిధరమ్ తేజ్ నెక్స్ట్ మూవీ నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి చిత్రలహరి అనే టైటిల్ ఖరారు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సాఫ్ట్ టైటిల్ వెనుక చాలా విషయం ఉందట.

చిత్ర, లహరి అనేవి ఈ చిత్రంలోని హీరోయిన్స్ పేర్లట.వీరితో తేజు సాగించే ప్రేమాయణమే చిత్రలహరి అని అంటున్నారు. కిషోర్ తిరుమల ఆసక్తికరమైన ట్రైయాంగిల్ లవ్ స్టోరీతో రూపొందించ బోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ కొత్త గెటప్ లో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











