వినయ విధేయ రామ ఆడియో వేడుక.. ఇంట్రెస్టింగ్ అప్డేట్!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ టీజర్ నిన్ననే విడుదలై మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఈ టీజర్ కోసం ఎదురుచూసారు. రాంచరణ్ మాస్ గెటప్, అదిరిపోయే డైలాగ్స్ డెలివరీ చేయడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వినయ విధేయ రామ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ చిత్రం కోసం చిత్ర యూనిట్ భారీ ప్రచార కార్యక్రమాలకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్ర ఆడియో వేడుకని వైజాగ్ లో నిర్వహించబోతున్నారంటూ ఆసక్తికర వార్త ప్రచారం జరుగుతుండడం విశేషం. రంగస్థలం ఈవెంట్ కూడా వైజాగ్ లోనే నిర్వహించారు.

మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి ఏ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రాంచరణ్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. వివేక్ ఒబెరాయ్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. దేవిశ్రీ ఈ చిత్రాన్ని సంగీత దర్శకుడు.


Click it and Unblock the Notifications











