ఆసక్తిని రేకెత్తించే అంశంతో నితిన్, చంద్రశేఖర్ యేలేటి చిత్రం

యంగ్ హీరో నితిన్ గత ఏడాది ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రంలో నటించాడు. ఈ రెండు చిత్రాలు నితిన్ కు నిరాశనే మిగిల్చాయి. ఈ ఏడాది ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని నితిన్ భావిస్తున్నాడు. ఛలో చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న వెంకీ కుడుముల దర్శత్వంలో నటించేందుకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఇది కాక నితిన్ మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ కి కూడా ఒకే చెప్పాడు. అందులో ఒకటి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలోని చిత్రం.

చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చిత్రానికి సంబంధించి ఆసక్తిని పెంచే అంశం బయటకు వచ్చింది. ఈ కథలో అవయవ దానం ప్రాముఖ్యతని దర్శకుడు తెలియజేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వినోదాన్ని అందిస్తూనే అవయవదనం అంశాన్ని చంద్రశేఖర్ యేలేటి హైలైట్ చేయబోతున్నారట. చంద్రశేఖర్ యేలేటి ఎప్పుడూ విభిన్నమైన కథలకు ప్రాధ్యానత ఇస్తారు. నితిన్ తో తెరకెక్కించబోయే చిత్రంలో కూడా కథే కీలకం కాబోతున్నట్లు తెలుస్తోంది.

Interesting Story line for Nithiin and Chandra shekhar Yeleti film

ఈ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి స్వరాలు అందించనున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా వెంకీ కుడుముల దర్శకత్వంలోని భీష్మ చిత్రాన్ని కూడా నితిన్ త్వరలో ప్రారంభించనున్నాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి పవర్ పేట అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X