రౌడీయిజంపై నితిన్ సినిమా.. కథ ఇదేనా!

యంగ్ హీరో నితిన్ గత ఏడాది ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రంలో నటించాడు. ఈ రెండు చిత్రాలు నితిన్ కు నిరాశనే మిగిల్చాయి. ఈ ఏడాదిలో మాత్రం తన చిత్రాల విషయంలో పక్కా ప్రణాళికతో వ్యవహరించాలని నితిన్ భావిస్తున్నాడు. ఛలో చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న వెంకీ కుడుముల దర్శత్వంలో నటించేందుకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కాకుండా నితిన్ ఇటీవల తన బర్త్ డే సందర్భంగా మరో రెండు చిత్రాలని ప్రకటించాడు. దీనితో నితిన్ నటించబోయే తదుపరి మూడు చిత్రాలు ఖరారయ్యాయి.

కృష్ణ చైతన్య దర్శత్వంలో నితిన్ ఓ చిత్రాన్ని ప్రకటించాడు. ఈ చిత్రానికి పవర్ పేట్ అనే ఆసక్తికరమైన టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్ర కథ రౌడీయిజం నేపథ్యంలో ఉండబోతోందట. ఈ చిత్రానికి పవర్ పేట్ అనే టైటిల్ ఎంచుకోవడానికి బలమైన కారణం ఉంది. ఏలూరు లో పవర్ పేట్ అనే రైల్వే స్టేషన్ ఉంది. బ్రిటిష్ కాలం నుంచి ఆ ప్రాంతానికి పవర్ పేట్ అనే పేరు వచ్చిందట.

 Interesting story line for Nithiin and Krishna Chaitanya movie

ఆ ప్రాంతంలో రౌడీయిజం ఛాయలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వంగవీటి రంగా, దేవినేని నెహ్రూ వద్ద పనిచేసిన రౌడీషీటర్స్ హత్యలు చాలా దారుణంగా జరిగాయట. ఈ అంశంతోనే కృష్ణ చైతన్య కథ సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. కృష్ణ చైతన్య ఏలూరు నగరానికి చెందిన వ్యక్తే కావడంతో ఈ అంశాలపై పూర్తి అవగాహనతో ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X