కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా.. ఆసక్తికరమైన టైటిల్ పెట్టిన తేజ!
కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్ జంటగా నటించిన కవచం చిత్రం నిన్ననే విడుదలై థియేటర్స్ లో సందడి చేస్తోంది. మరోమారు వీరిద్దరూ జంటగా నటిస్తున్నారు. తేజ దర్శత్వంలో కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్నారు. నేనే రాజు నేనే మంత్రి చిత్రం తరువాత తేజ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఆసక్తి నెలకొంది.
ఈ చిత్రానికి తేజ ఆసక్తికరమైన టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 'సీత' అనే టైటిల్ ఈ చిత్రానికి ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. హీరోయిన్ పాత్రకు అనుగుణంగా తేజ ఈ టైటిల్ ని ఎంచుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ పాత్ర అద్భుతంగా ఉండబోతోందని సమాచారం. నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో కూడా కాజల్ పాత్ర ఎమోషన్ తో కూడుకున్నది.

బెల్లంకొండ శ్రీనివాస్ చాలా రోజులుగా కమర్షియల్ హిట్ కోసంచూస్తున్నాడు. నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో తేజ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. దీనితో కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్ తో తేజ మ్యాజిక్ చేయబోతున్నాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











