రజని నెక్స్ట్ మూవీకి ఆసక్తికర టైటిల్.. మురుగదాస్ దర్శత్వంలో!

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాల జోరు తగ్గడం లేదు. గత ఏడాది రజిని కాలా, 2.0 చిత్రాలతో సందడి చేశారు. ఈ ఏడాది ఆరంభంలోనే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించ పేట చిత్రం విడుదలవుతోంది. రేపే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా సంచలన దర్శకుడు ఏఆర్ మురుగదాస్ రజనీకాంత్ తో చిత్రానికి ప్లాన్ చేస్తున్నారు.

మురుగదాస్ గత ఏడాది సర్కార్ చిత్రంతో సంచలనం సృష్టించారు. ఆ చిత్రం వివాదాలతో పాటు, రికార్డులు కూడా క్రియేట్ చేసింది. తాజాగా రజని చిత్రం గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి దర్శకుడు మురుగదాస్ 'నర్కాలి' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నర్కాలి అంటే తమిళంలో కుర్చీ అనే అర్థం వస్తుంది. దీనితో మురుగదాస్ మరో పొలిటికల్ డ్రామాకి ప్లాన్ చేశాడా అనే ఉహాగానాలు మొదలవుతున్నాయి.

Interesting title in consideration for Rajini, Murugadoss film

పేట చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. చాలా కాలం తర్వాత రజని ఫుల్ జోష్ లో నటిస్తున్న చిత్రం ఇది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్ర విడుదల విషయంలో వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. థియేటర్స్ కేటాయించడంలో పేట చిత్రానికి అన్యాయం జరిగిందని నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X