కళ్యాణ్ రామ్ కొత్త చిత్రానికి టైటిల్ ఇదే.. డ్యూయెల్ రోల్‌లో!
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఇటీవల విడుదలైన 118 చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కళ్యాణ్ రామ్ కు వరుసగా ప్లాపులు ఎదురవుతున్న సమయంలో ఈ విజయం అతడిని పరాజయాల నుంచి గట్టెక్కించింది.. దీనితో కళ్యాణ్ రామ్ మరింత ఉత్సాహంగా తదుపరి చిత్రాలని ఎంపిక చేసుకుంటున్నాడు. ఇకపై విభిన్నమైన కథలతో చిత్రాలు చేయాలని కళ్యాణ్ రామ్ భావిస్తున్నాడు. అందుకు తగ్గట్లుగానే కథలు ఎంచుకుంటున్నాడు.
కళ్యాణ్ రామ్ నెక్స్ట్ మూవీ వేణు మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. సోషల్ ఫాంటసీ నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతుందట. ఈ చిత్ర కథని వేణు మల్లిడి ఢిల్లీ సుల్తాన్ తుగ్లక్ చరిత్ర ఆధారంగా సిద్ధం చేశాడట. ఈ చిత్రంలో తుగ్లక్ కాలం నాటి సన్నివేశాలు ఉంటాయని అంటున్నారు. ముందుగా ఈ చిత్రానికి అశ్వథామ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ చిత్రానికి తుగ్లక్ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మరో విశేషం ఏంటంటే ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ డ్యూయెల్ రోల్‌లో నటించనున్నాడు. కేథరిన్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన త్వరలో రానుంది.


Click it and Unblock the Notifications











