నాని, ఇంద్రగంటి మోహన్ కృష్ణ కొత్త సినిమా టైటిల్ ఇదేనా!
డబుల్ హ్యాట్రిక్ చిత్రాల హిట్స్‌తో జోరుమీదున్న నానికి గత ఏడాది దేవదాస్, కృష్ణార్జున యుద్ధం చిత్రాలు బ్రేక్ వేశాయి. ఈ ఏడాది నాని వైవిధ్యం ఉన్నా కథలపై దృష్టి పెట్టాడు. గౌతమ్ తిన్ననూరి దర్శత్వంలో తెరకెక్కుతున్న జెర్సీ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. మరోవైపు మైత్రి మూవీస్ నిర్మాణంలో, విక్రమ్ కుమార్ దర్శత్వంలో గ్యాంగ్ లీడర్ చిత్రం ప్రారంభమైపోయింది. ఇదిలా ఉండగా తనని హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శత్వంలో నాని మూడవ చిత్రానికి రెడీ అవుతున్నాడు.
ఈ చిత్రంలో హీరో సుధీర్ బాబు కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నాని ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడట. ఇంద్రగంటి మోహన్ కృష్ణ నాని పాత్రని చాలా ఆసక్తికరంగా తీర్చిదిన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కథకు తగ్గట్లుగానే పవర్ ఫుల్ టైటిల్ పెట్టాలనేది దర్శకుడి ఆలోచన. వ్యూహం అనే టైటిల్ ని పరిసరిలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధం అవుతున్నారు. అదితి రావు హైదరి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనుంది. మరో హీరోయిన్ పాత్రకు కూడా ఆస్కారం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. నాని నటించిన జెర్సీ చిత్ర ప్రమోషన్స్ వేగం పెరిగింది. ఏప్రిల్ 19న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. నాని జెర్సీ చిత్రంలో క్రికెటర్ పాత్రలో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











