నితిన్ కొత్త సినిమా టైటిల్ భలేగుందే!
యంగ్ హీరో నితిన్ గత ఏడాది ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రంలో నటించాడు. ఈ రెండు చిత్రాలు నితిన్ కు నిరాశనే మిగిల్చాయి. ఈ ఏడాదిలో మాత్రం తన చిత్రాల విషయంలో పక్కా ప్రణాళికతో వ్యవహరించాలని నితిన్ భావిస్తున్నాడు. ఛలో చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న వెంకీ కుడుముల దర్శత్వంలో నటించేందుకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కాకుండా నితిన్ ఇటీవల తన బర్త్ డే సందర్భంగా మరో రెండు చిత్రాలని ప్రకటించాడు.
భీష్మ చిత్రం త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ చిత్రంలో నితిన్ కు జోడిగా రష్మిక మందన నటిస్తోంది. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నట్లు నితిన్ ప్రకటించాడు. భవ్య క్రియేషన్స్ నిర్మాణంలో ఈ ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. మరో ఆసక్తిక్రమైన ప్రాజెక్ట్ ని నితిన్ ప్రకటించాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరోసారి నితిన్ నటించబోతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఛల్ మోహన్ రంగ చిత్రం నిరాశపరిచిన సంగతి తెలిసిందే.

కృష్ణ చైతన్య దర్శత్వంలో నటించే చిత్రం నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ లో తెరకెక్కబోతోంది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు నితిన్ ప్రకటించాడు. ఈ చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్ ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 'పవర్ పేట' అనే టైటిల్ ని ఈ చిత్రం కోసం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











