మెగా హీరో సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్.. పాత్ర అదేనా!

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్న సంగతి తెలిసిందే. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సోదరుడైన వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ఈ ఏడాది ఆరంభంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. స్టార్ దర్శకుడు సుకుమార్, మైత్రి మూవీస్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీకి 'జాలరి' అనే టైటిల్ ఫిక్స్ చేశారట. ఏ చిత్ర ప్రీ లుక్ లో వైష్ణవ్ జాలరి వేషధారణలో కనిపిస్తున్నాడు. భుజంపై వల వేసుకుని మత్సకారుడి పాత్రలో వైష్ణవ్ కనిపించిన సంగతి తెలిసిందే. వైష్ణవ్ పాత్రకు సరిపడేలా జాలరి అనే టైటిల్ బావుంటుందని చిత్ర యూనిట్ ఓ అభిప్రాయానికి వచ్చింది. కాగా టైటిల్ గురించి చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా స్పందించలేదు.

Interesting title for Panja Vaishnav Tejs Debut movie

వైష్ణవ్ డెబ్యూ మూవీలో మరికొన్ని విశేషాలు కూడా ఉన్నాయి. ఈ చిత్రంలో విలన్ పాత్రలో తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ప్రతి నాయకుడిగా నటిస్తున్నాడు. ఇక రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండడం విశేషం. మెగా మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్ ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. మరి అతడి సోదరుడైన వైష్ణవ్ ప్రేక్షకులని ఏ మేరకు మెప్పించగలుగుతాడో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X