RT70: అతి భయంకరమైన టైటిల్ తో రాబోతున్న రవితేజ.. పవర్ఫుల్ కాన్సెప్ట్?

మాస్ మహారాజా రవితేజ ఎలాంటి సినిమా చేసినా కూడా పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇక ఈ ఏడాది క్రాక్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో రాజా ది గ్రేట్ సినిమా తో బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకున్న రవితేజ మళ్ళీ ఆ తరువాత వరుసగా హ్యాట్రిక్ డిజాస్టర్స్ ను చూడాల్సి వచ్చింది. జాగ్రత్తగా కథలను ఎంచుకుంటున్నప్పటికి కూడా రవితేజ కొన్నిసార్లు తడబడుతున్నాడు. అంతే కాకుండా ముందుగా ఇచ్చిన కమిట్మెంట్స్ వలన నిర్మాతల చెప్పిన సినిమాలకు ఒప్పుకోక తప్పలేదు. అయితే ఇక నుంచి ముందుగా ఏలాంటి కమిట్మెంట్స్ ఇవ్వకుండా వీలైనంతవరకు కథ విన్న తర్వాతనే ఓకే చేయాలని డిసైడ్ అయ్యాడు.

అంతేకాకుండా రవితేజ ముందుగా సినిమాలకు రెమ్యూనరేషన్ తీసుకోవడానికి కూడా సరికొత్త ఆలోచనతో ముందుకు వెళుతున్నాడు. సినిమా విడుదల తర్వాత లాభాల్లోనే వాటా అందుకునే విధంగా డీల్ సెట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో చాలా సినిమాలతో అపజయాలు చూసిన రవితేజ మరొకసారి అలాంటి పొరపాటు జరగకూడదని నిర్మాతల గురించి ఎంతో జాగ్రత్తగా ఆలోచిస్తున్నాడు. అందుకే క్రాక్ సినిమా విషయంలో రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా విడుదల తర్వాత ఒక ఏరియా హక్కులను సొంతం చేసుకున్నాడు. ఆ సినిమా ద్వారా మాస్ రాజాకు దాదాపు 16 కోట్లకు పైగా లాభాలు వచ్చినట్లు సమాచారం. తదుపరి సినిమాలు కూడా అదే తరహాలో ఉండాలని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

 interesting title for Ravi teja 70th project with sudheer varma direction

ఇటీవల రవితేజ 70 వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. యువ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ సినిమాను త్వరలోనే మొదలు పెట్టబోతున్నారు. అయితే సినిమాకు సంబంధించిన టైటిల్ కూడా కథకు తగ్గట్టుగా ఉండేలా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న కథనాల ప్రకారం ఈ సినిమాకు 'రావణాసుర' అనే పవర్ఫుల్ టైటిల్ ను సెట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. సినిమాలో కొన్ని థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది.

అలాగే చారిత్రాత్మక అంశాలతో కూడిన ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుందట. ఒక మిస్టరీ బ్యాక్ డ్రాప్ లోనే థ్రిల్లింగ్ అంశాలతో దర్శకుడు కథను రాసుకున్నట్లు సమాచారం. ఇక రవితేజ గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి కథలను చేసింది లేదు. వీలైనంత వరకు సరి కొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో స్టార్ క్యాస్ట్ గట్టిగానే ఉండబోతుందని టాక్ అయితే వస్తుంది. ఇక ప్రస్తుతం రవితేజ ఖిలాడి సినిమాను విడుదలకు సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే శరత్ దర్శకత్వంలో రామారావు సినిమాను కూడా సెట్స్ పైకి తెచ్చాడు. ఇక ఆ తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు ధమాకా అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X