నందమూరి హీరో సినిమాకు వెరైటీ టైటిల్!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సూపర్ హిట్ చిత్రం పటాస్ తో తిరిగి పుంజుకున్నారు. ఆతరువాత మళ్ళీ కళ్యాణ్ రామ్ నటించిన చిత్రాలు నిరాశపరిచాయి. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

కళ్యాణ్ రామ్ సరసన ఈ చిత్రంలో నివేద థామస్, షాలిని పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ కు సంబంధించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రానికి 118 అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. కథలో భాగంగానే 118 అయితే బావుంటుందనేది చిత్ర యూనిట్ అభిప్రాయం.

Interesting title for Kalyan Ram next movie

2019 ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహకాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ బయోపిక్ లో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తన తండ్రి హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు. హరికృష్ణ గెటప్ లో ఉన్న కళ్యాణ్ రామ్ లుక్ అభిమానులని ఆకట్టుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X