నాగశౌర్య నెక్స్ట్ మూవీకి టైటిల్ అదేనా!
యువ హీరో నాగ శౌర్య ఛలో ఘన విజయం తరువాత ఆచి తూచి అడుగులు వస్తున్నాడు. నాగ శౌర్య ప్రస్తుతం నర్తనశాల చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆగష్టు 30 న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా నాగ శౌర్య నెక్స్ట్ మూవీ కూడా హోమ్ బ్యానర్ ఐరా క్రియేషన్స్ లోనే ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
డెబ్యూ దర్శకుడు తేజ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్ పరిశీలిస్తున్నారట. గణ అనే టైటిల్ ఈ చిత్రానికి ఖరారు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

నర్తనశాల చిత్రం తరువాత నాగశౌర్య నారి నారి నడుమ మురారి అనే చిత్రంలో నటించనున్నాడు. భవ్యక్రియేషన్స్ నిర్మించబోతున్నఈ చిత్రం పూర్తయ్యాక గణ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. విడుదలైన నర్తనశాల టీజర్ కు రెస్పాన్స్ వచ్చింది. ఛలో తరువాత నాగ శౌర్య వినోదాత్మక కథలపై దృష్టి పెడుతున్నాడు.


Click it and Unblock the Notifications











