ప్రభాస్ సినిమాకు విచిత్రమైన టైటిల్.. అర్థం చేసుకోవడం కష్టం!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఓ వైపు సాహో షూటింగ్ జరుగుతుండగానే ప్రభాస్ మరో చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శత్వంలో ప్రభాస్ నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ఇటలీలో ప్రారంభమైంది. 1970 కాలం నాటి ప్రేమ కథగా రాధాకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్ ఫిక్స్ చేశారంటూ ప్రచారం జరుగుతోంది. అమూర్ అనే టైటిల్ ఈ చిత్రానికి పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమూర్ అంటే కాస్త విచిత్రంగా అనిపించడం సహజమే. ఎందుకంటే ఇది ఫ్రెంచ్ పదం. అమూర్ అంటే ప్రేమ అని ఫ్రెంచ్ భాషలో అర్థం.

ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఆదివారం రోజు పూజ హెగ్డే ఈ చిత్ర షూటింగ్ లో జాయిన్ అయింది. ఇదిలా ఉండగా సాహో చిత్ర విడుదల విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. 150 కోట్ల భారీ బడ్జెట్ చిత్రం కావడంతో ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











