రాజ్ తరుణ్ కొత్త చిత్రానికి టైటిల్ ఇదేనా!
గత ఏడాది దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన అన్ని చిత్రాలు నిరాశపరిచాయి. ఈ ఏడాది అలా జరగకూడదని దిల్ రాజు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సంక్రాంతికి వచ్చిన ఎఫ్2 చిత్రం ఘనవిజయం సాధించడంతో దిల్ రాజు శుభారంభం చేశారు. దిల్ రాజు తక్కువ బడ్జెట్ లో చిత్రాలు నిర్మించి విజయాలు అందుకోవడంలో దిట్ట. యువ హీరో రాజ్ తరుణ్ తో దిల్ రాజు ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.
వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన లవర్ చిత్రాన్ని గత ఏడాది నిరాశపరిచింది. మరోమారు రాజ్ తరుణ్ తో దిల్ రాజు చిన్న చిత్రానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఆడు మగాడ్రా బుజ్జి ఫేమ్ కృష్ణారెడ్డి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్ర టైటిల్ కు సంబంధించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. 'నీది నాది ఒకేటే లోకం' అనే టైటిల్ ని ఈ చిత్రానికి పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

హుషారైన నటన, హాస్యం పండించగల నేర్పుతో రాజ్ తరుణ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఇటీవల ఈ యువ హీరోకి సరైన సక్సెస్ లేదు. ప్రస్తుతం రాజ్ తరుణ్ కు కెరీర్ నిలబెట్టే హిట్ అవసరం. ఈ చిత్రంతో అయినా రాజ్ తరుణ్ సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.


Click it and Unblock the Notifications











