ప్రభాస్ కొత్త సినిమా.. ఒక్క సెట్ కోసం 7 కోట్లు ఖర్చు!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. బాహుబలి 2 తరువాత ప్రభాస్ వెండి తెరపై కనిపించకపోయినా ప్రస్తుతం నటిస్తున్న రెండు చిత్రాలు విడుదలైతే ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే అని చెప్పొచ్చు. ప్రభాస్ ప్రస్తుతం భారీ యాక్షన్ చిత్రం సాహోలో నటిస్తున్నాడు. ఈ చిత్రం దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కుతోంది.

ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే ప్రభాస్ మరో చిత్రాన్ని ప్రారంభించాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శత్వంలో ప్రభాస్ కొత్త చిత్రం రూపొందుతోంది. ఇటీవలే ఇటలీలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. క్రేజీ హీరోయిన్ పూజ హెగ్డే ఈ చిత్రంలో నటిస్తోంది. పూజ హెగ్డే కూడా షూటింగ్‌లో జాయిన్ అయింది. 1960, 70 నాటి పరిస్థితుల నేపథ్యంలో అద్భుతమైన ప్రేమ కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Interesting update on prabhas new movie

ఇటలీ షెడ్యూల్ తరువాత ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో జరగనుందట. ఈ చిత్రం కోసం హైదరాబాద్ లో 7 కోట్ల ఖర్చుతో భారీ సెట్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఏస్థాయిలో ఈ చిత్రం రూపొందుతోందో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. అమూర్ అనే టైటిల్‌ని ఈ చిత్రానికి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X