twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబు కోసం పర్ఫెక్ట్ ప్లాన్ తో సిద్దమైన స్టార్ డైరెక్టర్.. ఆ సినిమా వచ్చేది ఎప్పుడంటే?

    |

    సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రాబోయే సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనేది టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈపాటికి ఈ సినిమా మొదలు కావాల్సింది. కరోనా పరిస్థితుల కారణంగా అలాగే మహేష్ బాబు తొందరగా సర్కారు వారి పాటను ఫినిష్ చేయాలనే ఆలోచనతో కాస్త ఆలస్యంగా మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యాడు. అలాగే త్రివిక్రమ్ మరో వైపు భీమ్లా నాయక్ ను ఫినిష్ చేసే వరకు కొంత బిజీగా ఉంటారు కాబట్టి మహేష్ సినిమాకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

    ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికిపైగా పూర్తయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఒక బిగ్ సెట్ లో యాక్షన్ షూటింగ్ తో ఈ చిత్రం యూనిట్ బిజీగా ఉంది. ఇక వచ్చే నెల లేదా నవంబర్ లోపు షూటింగ్ పనులను పూర్తి చేయాలని దర్శకుడు పరశురామ్ అయితే ఒక ప్లాన్ సెట్ చేసుకున్నాడు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇదివరకే మహేష్ బాబు సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. హీరోయిన్ విషయంలో ఇప్పటికే పూజా హెగ్డేను ఫైనల్ చేసినట్లుగా క్లారిటీ వచ్చేసింది. మరో హీరోయిన్ కోసం ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇక నవంబర్లోనే మహేష్ బాబుతో త్రివిక్రమ్ కొత్త ప్రాజెక్టును స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

    Interesting update on Trivikram srinivas mahesh babu film

    ఈ సినిమాను కేవలం మూడు నెలల్లో పూర్తి చేయాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక టార్గెట్ అయితే సెట్ చేసుకున్నాడట. మహేష్ బాబు గతంలో చాలా వేగంగా బిజినెస్ మెన్ సినిమాను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇక త్రివిక్రమ్ కూడా మహేష్ కు తగ్గట్టుగా ఒక ప్లాన్ అయితే ప్రిపేర్ చేసినట్లుగా తెలుస్తోంది. అందుకోసం ముందుగా లొకేషన్ విషయంలో కూడా ఒక క్లారిటీ కి వచ్చినట్లు సమాచారం. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అనంతరం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ పాన్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. RRR సినిమా రిలీజ్ అనంతరం దర్శకుడు రాజమౌళి ఒక రెండు నెలలు గ్యాప్ తీసుకుని మహేష్ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయనున్నాడు.

    ఇప్పటికే కథ అయితే సిద్ధం అయ్యింది కానీ దర్శకుడు రాజమౌళి అయితే ఫైనల్ చేయలేదు. ఒక్కసారి ఫైనల్ చేస్తే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెడతారు. ఇక వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంటుందట. ఇక ఆ తర్వాత మహేష్ బాబు పూర్తిగా రాజమౌళికి ఒక ఏడాదిపాటు డేట్స్ ఇవ్వనున్నాడు. రాజమౌళి సినిమా పూర్తి అయ్యే వరకు కూడా మహేష్ బాబు మరో సినిమా మొదలు పెట్టే అవకాశం అయితే లేదట. ఆ సినిమా కోసం ఫిట్నెస్ లో కూడా మహేష్ బాబు కొంత మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 2024 లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావచ్చని సమాచారం.

    English summary
    Interesting update on Trivikram srinivas mahesh babu film,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X