twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Irrfan Khan filmography, Awards: ఎల్లలు లేని నటుడు.. హాలీవుడ్ టూ టాలీవుడ్

    |

    సినీ ప్రపంచంలో ఎల్లలు లేని నటుడు ఇర్ఫాన్ ఖాన్. బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా ఆఫర్ ముందుకొచ్చిన ప్రతీసారి తన నటనతో ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించారు. సలాంబాంబే చిత్రంలో లేఖలు రాస్తూ కనిపించే వ్యక్తిగా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఇర్ఫాన్ ఖాన్.. అనేక భిన్నమైన, విభిన్నమైన పాత్రలతో ఆలరించారు.

    ఆయన నటించిన చిత్రాల్లో ఏక్ డాక్టర్ కి మౌత్, ముజ్‌సే దోస్తి కరోగే, ఫుట్ పాత్, మక్బూల్, రోట్ టు లడఖ్, ది నేమ్ సేక్, సండే, క్రేజీ 4, ముంబై మేరి జాన్, స్లమ్ డాగ్ మిలియనీర్, పాన్ సింగ్ తోమార్, ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్, సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగస్టర్ రిటర్న్, లంచ్ బాక్స్, గూండే, హైదర్, పికూ, తల్వార్, జజ్బా, హిందీ మీడియం, బ్లాక్ మెయిల్, కార్వాన్, అంగ్రేజీ మీడియం లాంటి హిందీ చిత్రాలు అత్యంత ప్రజాదరణ పొందాయి.

     Irrfan Khan filmography, Awards: The man without boundaries for Acting

    ఇర్ఫాన్ ఖాన్ తన కెరీర్‌లో పజిల్, బక్షూ, ది మిత్, ది వారియర్, నేమ్ సేక్, ది డార్జిలింగ్ లిమిటెడ్, స్లమ్ డాగ్ మిలియనీర్, న్యూయార్క్, ఐ లవ్ యూ, ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్, లైఫ్ ఆఫ్ పై, జురాసిక్ వరల్డ్, ఇన్‌ఫెర్నో లాంటి అంతర్జాతీయ సినిమాల్లో కీలక పాత్రలను పోషించారు.

    తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సైనికుడు చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో ఆయన పోషించిన పప్పు యాదవ్ పాత్ర విశేషంగా ఆకట్టుకొన్నది.

    ఇక ఆయన యాక్టింగ్ కేరీర్ టెలివిజన్ రంగంలో శ్రీకాంత్ అనే టెలివిజన్ సీరియల్‌తో ఆరంభమైంది. భారత్ ఏక్ కోజ్, చాణక్య, చంద్రలేఖ, బనేగి అప్పీ బాత్, డర్, జస్ట్ మొహబ్బత్, జై హనుమాన్, బాంబే బ్లూ, మానో యా నా మానో, డాన్, ఎంటీవీ హీరో హోండా రోడీస్ 7, టోక్యో ట్రయల్ లాంటి సీరియల్స్‌లోను, ఎపిసోడ్స్‌లో అద్బుతమైన నటనను ప్రదర్శించారు. లెగో జురాసిక్ వరల్డ్, లెగో డైమెన్షన్స్ లాంటి వీడియో గేమ్స్‌లో కనిపించారు.

    ఇర్ఫాన్ తన కెరీర్‌లో పలు అవార్డులు, నామినేషన్లు సాధించారు. సలాం బాంబే సినిమాలోని నటనకు గాను ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యారు. మక్బూల్, హాసిల్ సినిమాల్లో ఉత్తమ విలనిజానికి ఫిలింఫేర్ అవార్డులు లభించాయి. లైఫ్ ఇన్ మెట్రో చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ సహాయనటుడు అవార్డు లభించింది. పాన్ సింగ్ తోమార్ ఉత్తమ క్రిటిక్స్ ఫిలింఫేర్ అవార్డు లభించింది. ది లంచ్ బాక్స్ సినిమాలోని నటనకు బాఫ్టా అవార్డుకు నామినేట్ అయ్యారు.

    English summary
    Irrfan Khan filmography, Awards: Saahabzaade Irfan Ali Khan credited as Irrfan Khan or simply Irrfan, is an Indian film actor, known for his work predominantly in Hindi cinema, as well as his works in British films and Hollywood.[1][2] He made his screen debut with the Academy Award nominated film Salaam Bombay! (1988). In occassion of his sad demise, Irrfan Filmography and awards are like,,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X