twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాకు చావు ఖాయం.. మరణాన్ని ముందే ఊహించిన ఇర్ఫాన్.. అసలు విషయాన్ని బయటపెట్టిన కొడుకు

    |

    భారతీయ సినిమా పరిశ్రమలో ప్రతిభావంతులైన నటుల్లో ఇర్ఫాన్ ఖాన్ ఒకరు. ప్రపంచ సినిమా వెండితెరపైన అద్భుతంగా రాణిస్తున్న సమయంలోనే క్యాన్సర్‌ వ్యాధితో అర్ధాంతరంగా ఈ లోకాన్ని వీడిపోవడం తీవ్ర విషాదంగా మారింది. ఇలాంటి విషాదాన్ని అధిగమించడమే కాకుండా తన తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా తండ్రి ఇర్ఫాన్ ఖాన్ చివరి రోజుల్లో జరిగి విషయాలను బాబిల్ ఖాన్ పంచుకొన్నారు. బాబిల్ ఖాన్ చెప్పిన విషయాలు ఏమిటంటే..

    రెజీనా కాసాండ్రా.. చీరలో ఎన్ని అందాలో..

    మరణం తప్పదనే ముందే..

    మరణం తప్పదనే ముందే..

    మరణం తప్పదనే విషయాన్ని నాన్న ముందే గ్రహించారు. అందుకు ఆయన మానసికంగా సిద్ధమయ్యారు. తన మరణం తర్వాత కుటుంబం ఎలాంటి సమస్యలను ఎదుర్కోకుండా మానసికంగా ధైర్యాన్ని చెప్పేవారు. మమల్ని కూడా అలాంటి విపత్తును ఎదుర్కోవడానికి ముందే ప్రిపేర్ చేశారు అని బాబిల్ ఖాన్ తెలిపారు.

    చివరి రోజుల్లో హాస్పిటల్‌లో

    చివరి రోజుల్లో హాస్పిటల్‌లో

    నాన్న ఇర్ఫాన్ ఖాన్ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుండంతో హాస్పిటల్ చేర్పించాం. చివరి రోజుల్లో మెల్లమెల్లగా స్పృహను కోల్పోయాడు. మరణానికి చివరి రెండు రోజుల్లో హాస్పిటల్‌లో ఆయన వెంట నేను ఉన్నాను. ఓ రోజు నేను చనిపోవడం ఖాయమని నాతో చెబితే.. అలా అనకండి.. మీకు ఏమీ కాదు అని చెప్పే ప్రయత్నం చేశాను. దాంతో ఆయన నవ్వుతూ నిద్రలోకి జారిపోయారు. ఆయన మృత్యువుకు లొంగిపోయాడని నాకు అప్పడే అనిపించింది. ఆ తర్వాత నేను పూర్తిగా మౌనంలో మునిగిపోయాను అని బాబిల్ ఖాన్ చెప్పారు.

     నాన్నతో అలాంటి గొడవ

    నాన్నతో అలాంటి గొడవ

    నాన్నతో నాకు మంచి అనుబంధం ఉండేది. నన్ను ఓ స్నేహితుడిలా చూసేవారు. నాకు 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఓ సారి గొడవ పడి ఏడాదిపాటు మాట్లాడుకోలేదు. ఆ తర్వాత మా మధ్య బంధం మరింత బలపడింది. నీకు వయసు కంటే ఎక్కువగా మెచ్యురిటీ వచ్చింది. అలా రాకుండా ఉండాల్సిందని అన్నారని తండ్రి గురించి బాబిల్ ఖాన్ తెలిపారు.

    జాతకాలపై బలమైన నమ్మకం

    జాతకాలపై బలమైన నమ్మకం

    ఇర్ఫాన్ గురించి భార్య సుతాప చెబుతూ.. ఆయనకు జాతకాలపై బలమైన నమ్మకం ఉండేది. ఆయన ముస్లిం మతానికి, నేను హిందు మతానికి చెందిన వాళ్లం. నాకు జన్మకుండలి లేకుంటే ఆయనే రాయించారు. తన లైఫ్ గురించి అంతా ముందే తెలుసు. తను ఎప్పుడు చనిపోతారనే విషయం మేము తొలిసారి కలిసినప్పటి నుంచి ఆయనకు తెలుసు అని సుతాప వెల్లడించారు.

    Recommended Video

    Irrfan Khan To Act Prabhas And Nag Ashwin's Movie But We Missed Him In Second Telugu Movie
    బాబిల్ ఖాన్ బాలీవుడ్ ఎంట్రీ

    బాబిల్ ఖాన్ బాలీవుడ్ ఎంట్రీ

    తండ్రి ఇర్ఫాన్ ఖాన్ వారసత్వంతో ఖాలా అనే చిత్రంతో బాబిల్ ఖాన్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అన్వితా దత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తృప్తి దిమ్రితో కలిసి బాబిల్ నటించారు. బాబిల్ ఖాన్ బాలీవుడ్‌లోకి ప్రవేశించిన సందర్భంగా బిగ్‌బీ అమితాబ్ శుభాకాంక్షలు అందించారు. తండ్రి మాదిరిగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

    English summary
    Irrfan Khan son Babil Khan reveals few days before his father death. Babil Khan said, My father is lost his conciousness before his death. He said, I am going die. Apart from this, Babil Khan entered into bollywood with Qala movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X