మూడో పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరో.. ఆ కుర్ర హీరోయిన్‌తో హీరోయిన్ అఫైర్ కారణంగానే..

ఇతర ఇండస్ట్రీలతో పోల్చుకొంటే హిందీ చిత్ర పరిశ్రమలో అఫైర్లు, డేటింగ్స్, బ్రేకప్స్ సర్వసాధారణంగా కనిపిస్తాయి. హీరో, హీరోయిన్ల మధ్య సంబంధాలు ఎప్పుడూ మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షిస్తూనే ఉంటాయి. అయితే మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్, కిరణ్ రావు విడాకులు తీసుకోవడం కొద్ది నెలల క్రితం బాలీవుడ్‌లో ప్రకంపనలు రేపాయి. అయితే ఈ విడాకుల వెనుక రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే తాజాగా బాలీవుడ్‌లో అమీర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకొంటున్నారనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

 అమీర్ ఖాన్ వైవాహిక జీవితం

అమీర్ ఖాన్ వైవాహిక జీవితం

అమీర్ ఖాన్ వైవాహిక జీవితం విషయానికి వస్తే.. 1986లో రీనా దత్తా అనే నటిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. దాదాపు 16 ఏళ్ల వైవాహిక జీవితం గడిపిన తర్వాత అమీర్, రీనా విడిపోయారు. వారికి ఇరా ఖాన్, జునైద్ ఉన్నారు. ఆ తర్వాత కిరణ్ రావు అనే సినీ డైరెక్టర్‌ను 2005లో వివాహం చేసుకొన్నారు. వారికి ఆజాద్ అనే కుమారుడు ఉన్నారు. ఆ తర్వాత 2021లో వారిద్దరు విడిపోయారు.

అమీర్ ఖాన్, కిరణ్ రావు విడాకుల వెనుక

అమీర్ ఖాన్, కిరణ్ రావు విడాకుల వెనుక

అయితే అమీర్ ఖాన్, కిరణ్ రావు విడిపోవడం వెనుక ప్రత్యేకమైన కారణాలు ఏమీ లేవు. వ్యక్తిగతం ఒంటరి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నాం. ఒకరిని ఒకరు గౌరవించుకొంటూ స్నేహితులుగా గడపాలని నిర్ణయం తీసుకొన్నారు. కుమారుడు ఆజాద్ బాధ్యతను ఇద్దరు కలిసి తీసుకోవాలని నిర్ణయించుకొన్నారు. విడాకులు తర్వాత కూడా వారిద్దరు కలిసి పనిచేయడంతో వారి మధ్య విభేదాలు ఉన్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తేలింది.

ఫాతీమా సనా షేక్‌తో అఫైర్ అంటూ..

ఫాతీమా సనా షేక్‌తో అఫైర్ అంటూ..

ఇక కిరణ్ రావుతో విడాకులు తీసుకొన్నట్టు అమీర్ ఖాన్ ప్రకటించగానే రకరకాల ఊహాగానాలు వినిపించాయి. దంగల్ సినిమాలో నటించిన ఫాతీమా సనా షేక్‌తో అఫైర్ కారణంగానే విడాకులు తీసుకొన్నారనే వార్త వినిపించింది. అయితే అందుకు తగినట్టుగానే కొన్ని విషయాలు ఆ వార్తలకు బలం చేకూర్చాయి.

 వార్తలను ఖండించిన ఫాతీమా సనా

వార్తలను ఖండించిన ఫాతీమా సనా

అయితే అమీర్ ఖాన్, కిరణ్ రావు విడాకులు తీసుకోవడానికి ప్రత్యేక కారణాలు తానే కారణమని వినిపిస్తున్న వార్తలను ఫాతీమా సనా ఖాన్ ఖండించారు. అందుకు నేను కారణం కాదు. అలాంటి వార్తల్లో వాస్తవం లేదు అని వివరణ ఇచ్చారు. అయితే ఆ వార్తలకు అడ్డుగోడ పడలేదు. ఇటీవల కాలంలో అమీర్, ఫాతీమా అఫైర్ గురించిన వార్తలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి.

నా గురించి తెలియకుండానే గాసిప్ప్

నా గురించి తెలియకుండానే గాసిప్ప్


ఇలంటి పరిస్థితులల్లో ఫాతీమా సనా ఖాన్ మాట్లాడుతూ.. నన్ను కలువని వారు.. నాతో ఎలాంటి పరిచయం లేని వారు.. నా గురించి వార్తలు రాస్తున్నారు. నా జీవితానికి సంబంధించిన అసలు విషయాలు ఎవరికి తెలియదు. నన్ను మంచి వ్యక్తి కాదనే విధంగా వార్తలు రాస్తున్నారు. ఏదైనా నా గురించి రాయాలంటే.. నన్ను కలిసి అడగండి. మీ అనుమానాలకు నేను సమాధానం చెబుతాను. అంతేకాని నా గురించి ఏదో ఊహించుకొని రాయవద్దని నా మనవి అని ఫాతీమా సనా షేక్ అంటారు.

Recommended Video

Love Story Pre Release Event | Ap Govt కి చిరు విన్నపాలు!!
అమీర్ ఖాన్ సినిమా కెరీర్ ఇలా..

అమీర్ ఖాన్ సినిమా కెరీర్ ఇలా..

ఇక అమీర్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా చిత్రంలో నటించడమే కాకుండా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ఆస్కార్‌కు నామినేట్ అయిన హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ చిత్రం ఆధారంగా రూపొందుతున్నది. ఈ చిత్రాన్ని సీక్రెట్ సూపర్ స్టార్ దర్శకుడు అద్వైత్ చందన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను అమీర్ కాన్, కిరణ్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా అక్కినేని నాగచైతన్య బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X