ఆ ఇద్దరిని ఫాలో అవుతున్న అల్లు అర్జున్? ఐకాన్ స్టార్ హాలీవుడ్ ప్లాన్ ఇదేనా?
ఇప్పుడు ఇండియన్ సినిమా నుంచి పలు పాత్ బ్రేకింగ్ సినిమాలే వస్తున్నాయి. ఇలా వస్తున్నా సినిమాల్లో బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న సినిమాలే అత్యధికంగా కనిపిస్తున్నాయి. కాగా ఈ సినిమాల్లో సౌత్ నుంచి వస్తున్న పలు సినిమాలు మాత్రం ఓ రేంజ్ లో ఇంపాక్ట్ ని వరల్డ్ వైడ్ సినిమా దగ్గర కూడా చూపిస్తున్నాయి.
కాగా ఒకప్పుడు అంటే ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా అనుకునేవారు కానీ ఇపుడు మాత్రం మన తెలుగు సినిమా నటీనటులు సాంకేతిక వర్గం ఇస్తున్న అవుట్ పుట్ కోసం ప్రపంచమే మాట్లాడుకుంటుంది. కాగా ఇపుడు ఇలాంటి సెన్సేషనల్ కాంబినేషన్ ఒకటి అనౌన్స్ అవ్వడం జరిగింది.

ఇది కూడా ఎన్నో నెలల తరబడి ఊరిస్తూ వస్తున్న సెన్సేషనల్ కాంబినేషన్ చిత్రం దర్శకుడు అట్లీ అలాగే పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ల కలయిక అని చెప్పాలి. కాగా అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఎప్పుడు నుంచో సినీ వర్గాల్లో బజ్ వినిపిస్తూ వచ్చింది. ఇక ఎట్టకేలకి హాలీవుడ్ రేంజ్ లో విజువల్స్ తో అనౌన్స్ అయ్యిన ఈ సినిమా వీడియో చూసి అంతా షాకయ్యారు. కాగా ఈ సమయంలోనే అల్లు అర్జున్ సినిమాల ఎంపిక కోసం చర్చ మొదలైంది.
అల్లు అర్జున్ గత పుష్ప సినిమా ఇపుడు అట్లీతో సినిమా చూస్తుంటే మన తెలుగు బిగ్ స్టార్స్ ఇద్దరిని అల్లు అర్జున్ ఫాలో అయిపోతున్నాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా రావడానికి మూల కారణం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ ల రంగస్థలం అని అందరికీ తెలిసిందే.
కాగా దీనితో పాన్ ఇండియా లెవెల్ సినిమాని రూరల్ బ్యాక్ డ్రాప్ లో తీస్తే ఇక ఇపుడు బన్నీ చేస్తున్న హాలీవుడ్ లెవెల్ ప్రాజెక్ట్ కి మాత్రం ప్రభాస్ నటించిన సినిమా కల్కి 2898 ఎడి కారణం అంటున్నారు. బన్నీ అట్లీ సెటప్ అంతా చూస్తుంటే ఇది కూడా కల్కి తరహాలోనే హాలీవుడ్ రేంజ్ స్టఫ్ తోనే కనిపించేలా ఉందని అర్ధం అవుతుంది. దీనితో ఇలా అల్లు అర్జున్ తన హాలీవుడ్ రేంజ్ ప్లానింగ్ కోసం రామ్ చరణ్, ప్రభాస్ లనే ఫాలో అయిపోతున్నట్టుగా కనిపిస్తున్నాడని చెప్పవచ్చు.
మరి ఈ లెవెల్లో చేసుకుంటున్న ప్లాన్ అల్లు అర్జున్ ని నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళుతుందా లేదా అనేది చూడాల్సిందే మరి. కాగా ఈ చిత్రాన్ని తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఒక్క అల్లు అర్జున్ మరియు అట్లీల రెమ్యునరేషన్ కి మాత్రమే 250 కోట్లకి పైగా ముట్టజెప్పినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? హీరోయిన్ ఎవరు లాంటివి ముందు రివీల్ కానున్నాయి. ప్రస్తుతానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ నాటికి షూటింగ్ కంప్లీట్ చేసేయాలనే టార్గెట్ ని మేకర్స్ పెట్టుకున్నట్టుగా సినీ వర్గాల్లో టాక్.


Click it and Unblock the Notifications











