Ram Charan Allu Arjun: రాంచరణ్ కోసం అల్లు అర్జున్ త్యాగం? స్పెషల్ రిక్వెస్ట్‌తో వెనక్కి నిజమేనా?

గత కొన్నాళ్ల నుంచి తెలుగు రాష్ట్రాల్లో మన హీరోస్ విషయంలో పలు కాంట్రవర్సీలలో మెగా అండ్ అల్లు కుటుంబం నడుమ మొదలైన సున్నితమైన అంశం కూడా అని చెప్పాలి. కాగా ప్రతీ కుటుంబంలో కూడా ఇలాంటి పొరపత్యాలు ఉంటాయి కానీ ఇపుడు ఒక కష్టం వచ్చినప్పుడే అంతా కలుస్తారని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ తో క్లియర్ అయ్యి మెగా ఫామిలీ అంతా ఒకటే అని చాలా మంది అనుకున్నారు.

కానీ ఇది వారి కుటుంబంలో కనిపించవచ్చు కానీ సోషల్ మీడియాలో మాత్రం మెగా అండ్ అల్లు అర్జున్ అభిమానుల నడుమ గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా లేటెస్ట్ గా మెగా కుటంబం నుంచి వస్తున్న భారీ చిత్రం "గేమ్ ఛేంజర్". గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తో చేసిన మాసివ్ ప్రాజెక్ట్ ఇది. ఈ సినిమా ఫలితం ఒక్క రామ్ చరణ్ కి మాత్రమే కాకుండా దర్శకుడు శంకర్ కి మరీ ముఖ్యంగా నిర్మాత దిల్ రాజుకి చాలా కీలకంగా మారింది.

is allu arjun sacrificed for ram charan game changer

కాగా గత ఏడాది జనవరిలో పుష్ప 2 వచ్చి నెల రన్ ని కంప్లీట్ చేసుకుంది. రికార్డు వసూళ్లు సాధించింది. కానీ ఇది చాలదు అన్నట్టుగా మేకర్స్ లేటెస్ట్ గా ఎక్స్ట్రా 20 నిమిషాల రన్ టైం ని కలిపి 3 గంటల 40 నిమిషాల సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. కాగా ఇది కూడా సరిగ్గా గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ జనవరి 10 తర్వాత జనవరి 11నే వస్తుంది అని అనౌన్స్ చేయడం మెగా ఫ్యాన్స్ లో షాకింగ్ గా మారింది.

అయితే ఇది డెఫినెట్ గా గేమ్ ఛేంజర్ కి పెద్ద దెబ్బ అవుతుంది అని ముఖ్యంగా నార్త్ మార్కెట్ లో ఎఫెక్ట్ ఉండొచ్చు అని పలు రూమర్స్ వినిపించాయి. దీనితో అల్లు అర్జున్ మళ్ళీ కావాలని టార్గెట్ చేసాడు అంటూ గేమ్ ఛేంజర్ కి వచ్చే వసూళ్ళని దెబ్బ కొట్టాలని చూస్తున్నారని ఓ వెర్షన్ కూడా మొదలైంది. కానీ ఇపుడు లేటెస్ట్ గా ట్విస్ట్ బయటకి వచ్చింది.

is allu arjun sacrificed for ram charan game changer

జనవరి 11న రావాల్సిన పుష్ప రాజ్ వెనక్కి తగ్గాడట. తాజా రూమర్స్ ప్రకారం పుష్ప 2 మేకర్స్ ఈ విడుదలని ఆపాలని చూస్తున్నారట. దీనితో అల్లు అర్జున్ అండ్ టీం చరణ్ కోసం త్యాగం చేసినట్టే అనుకోవాలి. కాగా దీనికి మరో కారణం కూడా ఉందని పుకార్లు వినిపిస్తున్నాయి.

పుష్ప 2 మేకర్స్ కి మెగా అభిమానులు నుంచి ప్రత్యేక విన్నపం కూడా వెళ్లినట్టుగా తెలుస్తుంది. అందుకే గేమ్ ఛేంజర్ కి మాత్రమే కాకుండా ఇతర సంక్రాంతి సినిమాలకి కూడా ఎఫెక్ట్ కాకుండా ఉండాలనే కారణంతో రిక్వెస్ట్ చేయగా పుష్ప 2 మేకర్స్ ఈ రిలీజ్ ని అందాకా వాయిదా వేసుకున్నారట. కాగా కొత్త డేట్ ని త్వరలోనే అనౌన్స్ చేస్తారు అన్నట్టుగా ఇపుడు సినీ వర్గాల్లో టాక్.

More from Filmibeat

Read more about: ram charan game changer pushpa 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X