విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరో.. 18 ఏళ్ల దాంపత్య జీవితానికి గుడ్‌బై!

సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు, హీరోయిన్ల మధ్య విడాకుల వార్తలు భారీగా వినిపిస్తున్నాయి. సమంత రుత్, ప్రభు, నాగచైతన్య, అలాగే నిహారిక కొణిదెల విడాకులు తీసుకోగా, నటి కలర్స్ స్వాతి విడాకులు తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ హీరో ఫర్దీన్ ఖాన్ 18 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలకబోతున్నాడనే వార్త హిందీ పరిశ్రమలో కలకలం రేపింది. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్‌ లెజెండ్ ఫిరోజ్ ఖాన్ కుమారుడు ఫర్దీన్ ఖాన్‌ హీరోగా మారిన తర్వాత బాలీవుడ్ ప్రముఖ నటి ముంతాజ్ కుమార్తెతో నటాషా మధవానీతో 2005 సంవత్సరంలో వివాహం జరిగింది. వారికి 2013 సంవత్సరంలో డైనీ ఇసబెల్లా అనే కూతురు, అజారియస్ అనే కుమారుడు పుట్టారు. అయితే తర్వాత పిల్లల కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

 Fardeen Khan

అయితే ఐవీఎఫ్ ద్వారా సంతానం పొందేందుకు ఫర్దీన్ ఖాన్ దంపతులు లండన్‌కు మకాం మార్చారు. ఆ తర్వాత ఆమె గర్బం దాల్చింది. అయితే వారికి కవల పిల్లలు పుట్టారు. కానీ వారిద్దరూ కూడా మరణించడంతో నటాషా డిప్రెషన్‌లోకి వెళ్లింది అని బాలీవుడ్ మీడియా వెల్లడించింది

అయితే కొద్దికాలంగా వారిద్దరి మధ్య దాంపత్యపరమైన అభిప్రాయ బేధాలు తలెత్తాయి అనే విషయం మీడియాలో కనిపించింది. అయితే ఏడాది కాలంగా వారిద్దరు విడిపోయారు. వేర్వేరుగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వారి మధ్య విభేదాలను పరిష్కరించేందుకు కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో వారిద్దరూ విడిపోవాలనే నిర్ణయానికి కుటుంబ సభ్యులు మద్దతు తెలిపారు అని బాలీవుడ్ మీడియా వెల్లడించింది.

 Fardeen Khan

ప్రస్తుతం ఫర్దీన్ ఖాన్, నటాషా మధవానీ ఇద్దరు వెర్వేరుగా ఉంటారు. వారిద్దరూ కొంతకాలం క్రితమే విడిపోయారు. త్వరలోనే వారిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు. అయితే పిల్లల సంరక్షణ బాధ్యత విషయంలో వారిద్దరూ ఓ అవగాహనకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ తర్వాత వారిద్దరూ విడిపోయేందుకు కోర్టును ఆశ్రయిస్తారు అని మీడియా వెల్లడించింది.

ఫర్దీన్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రేమ్ అగన్ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన జంగల్ అనే సినిమాలో నటించాడు. తన కెరీర్‌లో భూత్, ఖుషీ, ఫిదా, నో ఎంట్రీ, ఆర్యన్, జస్ట్ మ్యారీడ్, డార్లింగ్, లైఫ్ ఫ్యాక్టరీ చిత్రాల్లో నటించాడు. 2010లో చివరి సారిగా దుల్హా హిల్ గయా అనే సినిమాలో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X