Chiranjeevi Vs Pawan Kalyan: చిరు, పవన్ బాక్సాఫీస్ వార్.. ఒకే నెలలో మెగా బ్రదర్స్ సినిమాలు?
తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఫ్యామిలీస్ కొన్ని ఉన్నాయి. కాగా ఈ ఫ్యామిలీస్ లో చాలా వరకు ఒకో ఫ్యామిలీ నుంచి మరో ఫ్యామిలీ హీరోకి నడుమ ఓ రేంజ్ లో థియేటర్స్ లో వార్ నడుస్తుంది. వేరే వేరే టైం లో వస్తేనే వసూళ్లు కంపార్ చేసుకుంటూ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తారు. కానీ ఒకే కుటుంబానికి చెందిన హీరోల నుంచి మాత్రం పలు సినిమాలు ఎప్పుడు ఒకే నెలలో కానీ ఒకే వారంలో కానీ వచ్చింది లేదు.
కానీ ఇపుడు టాలీవుడ్ లో ఒకే కుటుంబం హీరోస్ నడుమ భారీ యుద్ధం జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాగా ఆ కుటుంబం కూడా మెగా కుటుంబం నుంచే అట. నో డౌట్ గా ఇపుడు మెగా హీరోస్ లో భారీ మార్కెట్ ఉన్న వారిలో దిగ్గజ హీరో మెగాస్టార్ చిరంజీవి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల పేర్లు లేకుండా లిస్ట్ స్టార్ట్ కాదు.

మరి ఓపెనింగ్స్ లో ఒకరు కింగ్ అయితే ఓపెనింగ్స్, లాంగ్ రన్ లో మరొకరు కింగ్ అని చెప్పాలి. కాగా వీరిద్దరూ కూడా ఒకరి సినిమాల్లో ఒకరు రిఫరెన్స్ లు కూడా వాడుకున్నారు. కానీ బాక్సాఫీస్ దగ్గర క్లాష్ కి వచ్చింది లేదు. అయితే ఇపుడు పరిస్థితులు మాత్రం ఇలానే ఉండేలా ఉన్నాయని సినీ వర్గాల్లో రూమర్స్ వినిపిస్తున్నాయి.
కాగా ఇపుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా "విశ్వంభర" అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం "హరిహర వీరమల్లు" కూడా ఒకటి. కాగా ఈ రెండు సినిమాలు కూడా ఇపుడు బాక్సాఫీస్ దగ్గర ఒకే సమయంలో వచ్చేలా ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఆల్రెడీ మెగాస్టార్ విశ్వంభర సినిమా జనవరిలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది.

దీనితో మెగాస్టార్ సెంటిమెంట్ డేట్ మే 9న విడుదల చేస్తున్నట్టుగా స్ట్రాంగ్ రూమర్స్ ఉన్నాయి. జగదేక వీరుడు అతిలోక సుందరి, చూడాలని ఉంది లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఉండడంతో చిరు కూడా ఈ సెంటిమెంట్ డేట్ ని ఓకే చేశారట. కానీ ఇదే నెలలో పవన్ సినిమా కూడా మేకర్స్ రిలీజ్ చేయాలని చూస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా ఈ సినిమా మార్చ్ 28న రిలీజ్ చేయాల్సి ఉంది కానీ ఇపుడు ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పవన్ కూడా డేట్స్ ఇంకాఆ ఇవ్వకపోవడంతో మేకర్స్ సినిమాని మళ్ళీ వాయిదా వేసి మే లో విడుదల చేయాలని చూస్తున్నారట. కాగా ఇదే నిజం అయితే ఒకే నెలలో మెగా హీరోల బాక్సాఫీస్ యుద్ధం తప్పేలా లేదని చెప్పాలి. కాగా ఓకే సమయంలో వస్తే కష్టమే కానీ కొంచెం గ్యాప్ వచ్చి వస్తే మాత్రం భారీ వసూళ్లు గ్యారెంటీ అలాగే ఒకే నెలలో మెగా అభిమానులకి డబుల్ బొనాంజా అని చెప్పవచ్చు. మరి ఈ రెండు బిగ్ ప్రాజెక్ట్ లు ఒకే నెలలో వస్తాయో లేదో అనేది చూడాల్సిందే.


Click it and Unblock the Notifications