హీరో రాజశేఖర్‌కు తీవ్ర అస్వస్థత.. వైద్యుల హెచ్చరికతో అందుకే దూరంగా!
గరుడ వేగ సక్సెస్‌తో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ మళ్లీ ట్రాక్‌పైకి వచ్చారు. వేగంగా సినిమాలు చేస్తూ మళ్లీ రేసులో పరుగులు పెడుతున్నారు. తాజాగా ఆయన నటించిన కల్కి సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. టీజర్లు, ట్రైలర్లు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. దాంతో ప్రమోషన్ కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే అనూహ్యంగా ప్రమోషన్ కార్యక్రమాలను నిలిపి వేయడంతో అనేక సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. రిలీజ్ దగ్గర పడుతున్న కనీసం ప్రచారం చేయకపోవడంపై అనుమానాలు బలపడుతున్నాయి. ఇంతకు ప్రమోషన్ నిలిపి వేయడానికి కారణమేమిటంటే..

కల్కి ప్రమోషన్ కార్యక్రమాలు నిలిపివేత
కల్కి ప్రమోషన్ కార్యక్రమాలు నిలిపి వేయడంపై ఆరా తీయగా.. హీరో రాజశేఖర్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. హై ఫీవర్ సమస్య ఆయనను ప్రమోషన్స్‌కు దూరంగా ఉంచింది. కనీసం మాట్లడం, నడవడం చేయలేకపోతున్నారు. దాంతో నిర్మాతలను ప్రమోషన్ కార్యక్రమాలను రద్దు చేయమని కోరారు అని సినీ వర్గాలు వెల్లడించాయి.

విశ్రాంతిలో హీరో రాజశేఖర్
హీరో రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్టు సమాచారం. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని, లేకపోతే పరిస్థితి తీవ్రంగా మారే అవకాశాలు లేకపోలేవని వైద్యులు వెల్లడించడంతో కుటుంబ సభ్యులు తగు జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

ఆరోగ్య పరిస్థితి మెరుగైతే తప్పా
ఒకవేళ గురువారం నాటికి మాట్లాడే పరిస్థితి ఉంటే రాజశేఖర్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లేకపోలేదు. ఆయన ఆరోగ్య పరిస్థితిని బట్టి తదుపరి ప్రమోషన్ కార్యక్రమాలు ఉంటాయి. ఒకవేళ వీలు కాకపోతే రిలీజ్ తర్వాత భారీగా ప్రమోషన్ చేపట్టే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది.

మరో హిట్ కోసం ప్రశాంత్ వర్మతో
గరుడ వేగ హిట్ తర్వాత అ! మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మతో రాజశేఖర్ జతకట్టారు. ఈ చిత్రానికి జీవిత రాజశేఖర్, సీ కల్యాణ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా రాజశేఖర్ కూతుళ్లు శివానీ, శివాత్మిక కూడా నిర్మాణంలో భాగస్వామ్యులయ్యారు. ఈ చిత్రం జూన్ 28 తేదీన రిలీజ్ కానున్నది.

నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటులు: అదా శర్మ, నందితా శ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్, రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధూ జొన్నలగడ్డ, శత్రు, చరణ్ దీప్, వేణుగోపాల్, 'వెన్నెల' రామారావు, డి.ఎస్.రావు, సతీష్ (బంటి) ఈ చిత్రంలో ప్రధాన తారాగణం.

సాంకేతిక వర్గం:
ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర,
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్,
స్క్రీన్ ప్లే: స్క్రిప్ట్స్ విల్,
ఆర్ట్: నాగేంద్ర,
ఎడిటర్: గౌతమ్ నెరుసు,
స్టిల్స్: మూర్తి,
లిరిక్స్: కృష్ణకాంత్ (కె.కె),
కాస్ట్యూమ్ డిజైనర్: అదితి అగర్వాల్,
ఫైట్స్: నాగ వెంకట్, రాబిన్ - సుబ్బు,
ప్రొడక్షన్ కంట్రోలర్: సలన బాలగోపాల్ రావు,
చీఫ్ కో-డైరెక్టర్: మాధవ సాయి,
లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి,
పి.ఆర్.ఓ: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి,
సమర్పణ: శివాని, శివాత్మిక,
నిర్మాత: సి.కళ్యాణ్,
దర్శకత్వం: ప్రశాంత్ వర్మ


Click it and Unblock the Notifications











