For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాప్ హీరోయిన్‌తో హీరో సిద్దార్థ్ డేటింగ్.. మీడియాకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన లవ్ జంట!

  |

  దక్షిణాదిలో హీరోగా, నిర్మాతగా పాపులారిటిని సాధించిన హీరో సిద్దార్థ్ హిందీలో కూడా రాణించేందుకు ప్రయత్నించాడు. అయితే బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో నటించినప్పటికీ.. అక్కడ స్థిరంగా తనకంటూ స్థానాన్ని సంపాదించుకోలేకోపోయాడు. అయితే సినిమాల కంటే.. సిద్దార్థ్ తన లవ్ అఫైర్లతోనే నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. అయితే తాజాగా బాలీవుడ్‌తోపాటు దక్షిణాది చిత్రాల్లో రాణిస్తున్న తెలుగు అమ్మాయితో ప్రస్తుతం జోరుగా డేటింగ్ చేయడం జాతీయస్థాయిలో వైరల్ అయింది. గత కొద్దికాలంగా రూమర్లకే పరిమితమైన తాజా సిద్దార్థ్ లవ్ మ్యాటర్.. ఇప్పుడు నేషనల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.. సిద్దార్థ్ అవ్ అఫైర్ విషయాల్లోకి వెళితే..

  బాల్య స్నేహితురాలు మేఘనతో వివాహం

  బాల్య స్నేహితురాలు మేఘనతో వివాహం

  మణిరత్నం వద్ద దర్శకత్వం శాఖలో పనిచేసే సిద్దార్థ్‌కు శంకర్ రూపొందించిన బాయ్స్ సినిమాతో హీరోగా మారారు. ఆ తర్వాత పూర్తిస్థాయి హీరోగా నిలదొక్కొకొనే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో 2003లో తన చిన్ననాటి స్నేహితురాలు, ఢిల్లీకి చెందిన మేఘనతో సిద్దార్థ్ వివాహం జరిగింది. అయితే మూడేళ్ల దాంపత్య జీవితం తర్వాత 2007లో వ్యక్తిగత విభేదాల కారణంగా విడాకులు తీసుకొన్నారు. అప్పటి నుంచి సిద్దార్థ్ ఒంటరిగానే ఉంటూ వస్తున్నారు.

  సోహా అలీ ఖాన్‌తో పీకల్లోతు అఫైర్‌లో

  సోహా అలీ ఖాన్‌తో పీకల్లోతు అఫైర్‌లో

  బాలీవుడ్‌లో అమీర్ ఖాన్‌తో కలిసి రంగ్ దే బసంతి సినిమాలో నటించాడు. ఆ సినిమా షూటింగ్ సమయంలో సోహా ఆలీ ఖాన్‌తో డేటింగ్ చేశారు. వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే సోదరుడు సైఫ్ ఆలీ ఖాన్, తల్లి షర్మిలా టాగూర్‌ సూచన మేరకు సిద్దార్థ్‌తో అఫైర్‌కు సోహా ఆలీ ఖాన్ బ్రేకప్ చెప్పింది.

  శృతిహాసన్‌తో పెళ్లి వరకు వచ్చి..

  శృతిహాసన్‌తో పెళ్లి వరకు వచ్చి..

  సోహా ఆలీ ఖాన్‌తో బ్రేకప్ తర్వాత శృతిహాసన్‌తో సిద్దార్థ్‌ అఫైర్ మొదలుపెట్టాడు. శృతి కూడా బాలీవుడ్‌ కెరీర్‌పై దృష్టిపెట్టడంతో ముంబైలో వీరిద్దరూ సహజీవనం చేశారనే వార్తలు వచ్చాయి. శృతి, సిద్దార్థ్ అఫైర్ కూడా తండ్రి కమల్ హాసన్‌కు కూడా ఆమోదం లభించిందని మీడియాలో కథనాలు వచ్చాయి. 2010లో నుంచి వారిద్దరూ సహజీవనం చేశారు. అయితే సిద్దార్థ్ బిహేవియర్‌తో విసిగిపోయిన శృతి ఏడాదిన్నర సహజీవనం తర్వాత 2011 అక్టోబర్‌లో శృతిహాసన్ బ్రేకప్ చెప్పింది.

  సమంత రుత్ ప్రభుతో చీటింగ్ అంటూ

  సమంత రుత్ ప్రభుతో చీటింగ్ అంటూ

  శృతి హాసన్‌తో బ్రేకప్ జరిగిన రెండేళ్ల తర్వాత సమంతతో సిద్దార్థ్ అఫైర్ మొదలుపెట్టాడు. జబర్దస్త్ సినిమా షూటింగులో సిద్దార్థ్, సమంత మానసికంగా దగ్గరయ్యారు. దాంతో వారిద్దరు పీకల్లోతు ప్రేమ వ్యవహారంలో మునిగిపోయారు. వారిద్దరూ పెళ్లికి కూడా సిద్దమయ్యారు.

  కాళహస్తిలో పూజలు కూడా చేయించుకోవడం తెలిసిందే. అదే సమయంలో కన్నడ హీరోయిన్ దీప్తి సన్నిధితో సిద్దార్థ్ డేటింగ్ చేస్తున్నట్టు తెలియడంతో సమంతను తన స్నేహితులు హెచ్చరించారు. దాంతో వారిద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దాంతో వారిద్దరి మధ్య బ్రేకప్ జరిగింది.

  తాజాగా అదితిరావు హైదరీతో డేటింగ్

  తాజాగా అదితిరావు హైదరీతో డేటింగ్

  ఇదిలా ఉండగా, సమంతతో బ్రేకప్ తర్వాత పలువురు హీరోయిన్లతో సిద్దార్థ్ డేటింగ్ వ్యవహారం మీడియాలో కనిపించింది. అయితే అవి రూమర్లకే పరిమితమయ్యాయి. తాజాగా అదితిరావు హైదరీతో జోరుగా సిద్దార్థ్ అఫైర్ కొనసాగుతున్నట్టు వార్తలు మీడియాలో వచ్చాయి. అయితే వాటికి బలం చేకూరేలా విధంగా ఇటీవల పలు సందర్భాల్లో అదితి, సిద్దార్థ్ కనిపించారు.

  పొన్నియన్ సెల్వన్ ఈవెంట్లో కూడా వారిద్దరూ కలిసి ప్రత్యేక ఆకర్షణగా మారారు. తాజాగా ముంబైలో ఓ హోటల్‌లో ఇద్దరు చేతిలో చేతులు వేసుకొని కనిపించడంతో మీడియా దృష్టిని ఆకర్షించింది. వీరిద్దరి ఫోటోలు, వీరి డేటింగ్ వ్యవహారంపై ప్రస్తుతం ముంబై మీడియాలో జోరుగా చర్చ జరుగుతున్నది.

  English summary
  Indian Actor Siddharth tied the knot with Meghna, his childhood sweetheart from Delhi. However, for unknown reasons, the couple got divorced in 2007 after living separately for a year. from that, He had affairs with Sara Ali Khan, Shruti Haasan, Samantha Ruth Prabhu and Aditi Rao Hydari.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X