బాలయ్య వారసుడిపై షాకింగ్ న్యూస్... మోక్షజ్ఞ అందరి నోరు మూయిస్తాడా?
నందమూరి నటసింహం బాలకృష్ణ వారసత్వంతో ఆయన తనయుడు మోక్షజ్ఞ త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. బాలయ్య కూడా పలు సందర్భాల్లో ఈ విషయం ప్రస్తావించారు. మోక్షజ్ఞ తెరంగ్రేటం త్వరలోనే ఉంటుందని, అతడికి సూటయ్య మంచి స్క్రిప్టు కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.
సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి నటనతో పాటు డాన్సుల్లో శిక్షణ తీసుకుంటున్నట్లు కూడా ఆ మధ్య వార్తలు వినిపించాయి. ఫ్యాన్స్ సైతం మోక్షు తెరంగ్రేటం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఈ నందమూరి వారసుడి గురించి ఓ షాకింగ్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది.

మోక్షజ్ఞకు నటనపై ఆసక్తి లేదంటూ న్యూస్
మోక్షజ్ఞకు నటనపై ఆసక్తి లేదంటూ తాజాగా ఫిల్మ్ నగర్లో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అతడికి సినిమాల కంటే వ్యాపారాల మీదనే ఎక్కువ ఆసక్తి ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. అంతా సిద్దంగా ఉంది.. మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయమని భావిస్తున్న తరుణంలో... ఈ వార్తలు నందమూరి అభిమానులు షాకయ్యేలా చేస్తున్నాయి.

'మోక్షజ్ఞ కేరాఫ్ కాఫీ షాప్'
మోక్షజ్ఞ ఈ మధ్య కాలంలో తరచూ జూబ్లీహిల్స్‌లోని ఓ కాఫీ షాప్‌లో దర్శనమిస్తున్నారట. 'మోక్షజ్ఞ కేరాఫ్ కాఫీ షాప్' అంటూ ఇటీవల కొన్ని పత్రికల్లో వార్తలు సైతం ప్రచురితం అయ్యాయి. అతడిని చూస్తుంటే హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు లేదనే రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి.

మోక్షజ్ఞ అందరి నోళ్లూ మూయిస్తాడా?
స్టార్ హీరో ఫ్యామిలీ నుంచి వారసుడు వస్తున్నాడంటే ఇలాంటి రూమర్స్ సర్వసాధారణమే. మరి మోక్షజ్ఞ తన సినీరంగ ప్రవేశంపై వస్తున్న రూమర్లకు చెక్ పెడతారా? తనకు సినిమాలపై ఆసక్తి లేదని ప్రచారం చేస్తున్న వారి నోరు మూయిస్తాడా? లేదా? అది త్వరలో తేలనుంది.

నిర్మాతగా సాయి కొర్రపాటి పేరు, కానీ...
మోక్షజ్ఞ తొలి చిత్రం సాయి కొర్రపాటి నిర్మాణంలో ఉంటుందనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే 2017లో వచ్చిన ‘యుద్ధం శరణం' తర్వాత ఆయన బేనర్లో ఏ మూవీ కూడా నిర్మాణంలో లేదు. చివరగా 2018లో కెజిఎఫ్ మూవీని డిస్ట్రిబ్యూట్ చేశారు.

వార్తలను కొట్టిపారేస్తున్న బాలయ్య ఫ్యాన్స్
అయితే మోక్షజ్ఞ విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని బాలయ్య అభిమానులు కొట్టిపారేస్తున్నారు. మోక్షు విషయంలో ఇదంతా గిట్టనివారు చేస్తున్న ప్రచారమే అని స్పష్టం చేశారు. త్వరలోనే అందరి నోరు మూయిస్తూ మోక్షజ్ఞ తెరంగ్రేటం జరుగుతుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











