RRR తర్వాత ఆ ఇద్దరు టాప్ డైరెక్టర్లకు గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకులు ఎవరంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మంచి జోరుమీదున్నాడు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ కోసం ఎన్టీయార్ మూడేళ్లకు పైనే తన సమయం కేటాయించాడు. అదే సినిమాలో నటిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ వరుసబెట్టి సినిమాలు అంగీకరిస్తున్నాడు. తన తర్వాతి సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టేశాడు. అయితే ఎన్టీయార్ మాత్రం ఇంకా తన తర్వాతి సినిమాల గురించి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఇద్దరు దర్శకులకు ఎన్టీయార్ ఓకే చెప్పాడని టాలీవుడ్ వర్గాల సమాచారం.

RRR కోసం మూడేళ్లు

RRR కోసం మూడేళ్లు

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన RRR సినిమా కోసం ఎన్టీయార్, చరణ్ మూడేళ్ళకు పైగానే లాకయ్యారు. ఎట్టకేలకు ఈ సినిమా ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా విజయం మీద హీరోలిద్దరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా తమకు మంచి గుర్తింపు వస్తుందని ధీమాగా ఉన్నారు. ఇప్పటికే చరణ్ తన తర్వాతి సినిమాలకు పాన్ ఇండియా అప్పీల్ ఉండేలా చూసుకుంటున్నాడు. ఎన్టీయార్ కూడా అదే బాటలో నడవబోతున్నాడట. తనను కలిసే దర్శకులను పాన్ ఇండియా లెవెల్ కథలు అడుగుతున్నాడట.

ఆ రెండు సినిమాలు ఒకేసారి..

ఆ రెండు సినిమాలు ఒకేసారి..

ఉప్పెన సినిమాతో ఘనవిజయం అందుకున్న దర్శకుడు బుచ్చిబాబుతో ఎన్టీయార్ ఓ సినిమా చేయబోతున్నాడట. గ్రామీణ నేపథ్యంలో కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కబోతోందట. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోందట. ఇక, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కూడా ఎన్టీయార్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయట. ఈ రెండు సినిమాలు కూడా ప్యాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

బుచ్చిబాబు సినిమాకు ఆసక్తికర టైటిల్

బుచ్చిబాబు సినిమాకు ఆసక్తికర టైటిల్


ఎన్టీయార్ సినిమా కోసం బుచ్చిబాబు చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమాకు `పెద్ది` అనే టైటిల్ ఫిక్స్ చేశారట. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీయార్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడట. అరవై ఏళ్ల వయస్సు వాడిగా కూడా ఎన్టీయార్ కనబడనున్నాడట. హీరో పాత్ర చుట్టూ బలమైన ఎమోషన్స్ ఉంటాయట. RRR పనులు పూర్తయిన తర్వాతే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రాబోతోందట.

కొరటాల శివతో పొలిటికల్ సినిమా

కొరటాల శివతో పొలిటికల్ సినిమా


మెగాస్టార్ చిరంజీవితో `ఆచార్య` తర్వాత దర్శకుడు కొరటాల శివ.. ఎన్టీయార్ కోసం కథ సిద్ధం చేసుకున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందట. పొలిటికల్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఎన్టీఆర్‌ స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపిస్తాడని టాక్. ఈ సినిమాలో హీరోయిన్లుగా రష్మికా మందన్నా, కీర్తి సురేశ్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. `పెద్ది` సినిమాతో పాటు ఈ సినిమా షూటింగ్‌లో కూడా ఎన్టీయార్ సమాంతరంగా పాల్గొంటాడట.

Recommended Video

RRR: India's Biggest Pre Release Event At Chikkaballapura | NTR | SS Rajamouli | Filmibeat Telugu
మల్టీస్టారర్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు..

మల్టీస్టారర్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు..


దేశంలోనే అతి పెద్ద మల్టీస్టార్ సినిమా అంటూ `RRR` గురించి ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా తర్వాత మల్టీస్టారర్ సినిమాలు రెగ్యులర్‌గా వస్తుంటాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎన్టీయార్ చెప్పాడు. తను కూడా మల్టీస్టారర్ చిత్రాల్లో నటించేందుకు సిద్ధమేనని చెప్పాడు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతో పాటు ప్రభాస్, మహేష్ వంటి యంగ్ హీరోలతోనూ మల్టీస్టారర్ చిత్రాలు చేయాలనుకుంటున్నానని ఎన్టీయార్ చెప్పాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X