War 2 Remuneration: వార్ 2 మూవీకి ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఎంత? హృతిక్ కంటే ఎక్కువనా? తక్కువనా?

బాలీవుడ్‌లో ప్రముఖ ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న చిత్రం వార్ 2 (War 2). వార్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమాను ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్'గా నటిస్తున్న ఈ సినిమా అత్యంత క్రేజ్ ఉన్న మల్టీస్టారర్‌గా రూపొందుతున్నది. వార్ 2 సినిమా టీజర్‌ను తెలుగు, హిందీ, తమిళంలో ఆగస్టు 14వ తేదీన రిలీజ్ అవుతున్నది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీపైనే అందరి దృష్టి ఉంది. ఇప్పటి వరకు టాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైన ఆయన సినిమా జర్నీ.. ప్రస్తుతం హిందీ సినీ పరిశ్రమలో మొదలు కానున్నది. తన తొలి సినిమానే ప్రతిష్టాత్మకమైన బ్యానర్‌లో, హృతిక్ రోషన్‌తో కలిసి మల్టీ స్టారర్‌గా రూపొందిన ఈ సినిమాలో బలమైన పాత్రను ఆయన పోషిస్తున్నాడు. వార్ సినిమాకు సీక్వెల్ అనగానే నార్త్‌లోనే కాకుండా సౌత్‌లో కూడా ఆసక్తికరంగా ఎదురు చూడటం మొదలు పెట్టారు.ఇక ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ హిందీలో ఎంట్రీ ఇస్తున్నారనే విషయం మరింత క్రేజ్‌ను పెంచింది.

Jr NTR remuneration

అయితే ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ అనే విషయం బయటకు రావడంతో అనేక విషయాలు చర్చకు వచ్చాయి. హృతిక్ లాంటి సూపర్ స్టార్‌తో నటిస్తున్నారని వార్తతో ముందుగా ఫిజికల్‌గా ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఆ తర్వాత రెమ్యునరేషన్ విషయంలో ఎవరికి ఎక్కువ? ఎవరికి తక్కువ? అనే చర్చ మొదలైంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు భారీ రెమ్యునరేషన్ ఇచ్చారా? లేదా హృతిక్‌కు ఎక్కువ పారితోషికం ముట్టజెప్పారా? అంటూ ట్రేడ్ వర్గాలు ఆరా తీయడం మొదలుపెట్టాయి.

అయితే వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్‌లో పవర్‌ఫుల్ పాత్రతో హిందీ సినిమా పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ చిత్రంలో విలన్ పాత్రను పోషించేందుకు సిద్దమైన తారక్‌కు భారీగానే రెమ్యునరేషన్ ముట్టజెప్పినట్టు సమాచారం. అయితే బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్‌కు సుమారుగా 70 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్‌గా చెల్లించినట్టు సమాచారం.

ఇక హృతిక్ రోషన్ విషయానికి వస్తే.. ఎన్టీఆర్ కంటే తక్కువగానే పారితోషికం ఇచ్చినప్పటికీ.. ఓవరాల్‌గా భారీగానే రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్టు తెలిసింది. అయితే ఈ సినిమా కోసం హృతిక్‌కు సుమారుగా 50 కోట్ల రూపాయలు చెల్లించారు. అదనంగా లాభాల్లో షేర్ ఇచ్చేందుకు యష్ రాజ్ మూవీస్‌తో ఓప్పందం చేసుకొన్నారు. దాంతో తారక్ కంటే ఎక్కువగానే రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్టు సమాచారం.

వార్ 2 మూవీ సినిమాను విదేశాలతోపాటు సాంకేతికంగా రిచ్‌గా రూపొందించారు. ఈ చిత్రం కోసం వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ టెక్నాలజీని భారీగానే వాడారు. అలాగే తారల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్ తదితర అంశాలు అన్నీ కలుపుకొని ఈ సినిమాను సుమారుగా 400 కోట్ల రూపాయలు బడ్జెట్‌తో నిర్మించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా రలీజ్‌కు ముందే లాభాలను సాధించినట్టు బాలీవుడ్ మీడియా తమ రిపోర్టులలో వెల్లడించారు.

More from Filmibeat

Read more about: jr ntr hrithik roshan war 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X