Liplock Kisses: 20 లిప్‌లాక్స్‌తో యంగ్ హీరో రొమాన్స్.. హీరోయిన్ పరిస్థితి ఏంటో?

తెలుగు సినిమాలో మంచి టాలెంట్ ఉంటే ఇప్పుడు కాకపోయినా కొన్నాళ్ల తర్వాత అయినా కూడా రాణించిన యంగ్ హీరోస్ చాలా మంది కనిపిస్తారు. ఇలా టాలీవుడ్ లో ప్రతీ జెనరేషన్ లో కూడా చాలా మంది యువ హీరోలు పరిచయం అవుతూ వస్తున్నారు. కాగా ఇపుడు కూడా కొంతమంది యంగ్ హీరోలు తెలుగు ఆడియెన్స్ ని అలరిస్తుండగా వారిలో కూడా కొందరు ఒకో స్టైల్ లో ఒకో తరహా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు.

అయితే కెరీర్ ని సాఫ్ట్ గానే స్టార్ట్ చేసిన కొందరు హీరోలు తర్వాత వైల్డ్ అవుతున్నారు. అలాగే వైల్డ్ అండ్ బోల్డ్ సినిమాల తోనే ఎంట్రీ ఇచ్చినవారు అదే తరహా సినిమాలు సహా ఇతర జానర్ సినిమాలు కూడా చేస్తున్నారు. కాగా టాలీవుడ్ లోకి ఒక సాఫ్ట్ ఎంట్రీ ఇచ్చిన ఓ యంగ్ హీరో ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాకి బోల్డ్ గా మారబోతున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది.

Is kiran abbavaram perform 20 liplock Kisses with Nayan Sarika in dilruba

తన కెరీర్లో పలు సినిమాలు చేసిన ఆ యంగ్ హీరో ఇపుడు తన నెక్స్ట్ సినిమాకి ఏకంగా 20 లిప్ లాక్ చేసే సన్నివేశాల్లో షాక్ ఇవ్వనున్నట్టుగా ఇపుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా ఆ యంగ్ హీరో ఎవరో కాదు కిరణ్ అబ్బవరం అట. కిరణ్ తెలుగు సినిమాలో రాజా వారు రాణి గారు అనే సింపుల్ ప్రేమ కథ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరుస సినిమాలు వెంటవెంటనే చేసేసాడు.

పైగా ఈ లైనప్ లో పలు మాస్ సినిమాలు కూడా ఉన్నాయి కానీ ఈ యంగ్ హీరోపై నెమ్మదిగా భారీ ఎత్తున నెగిటివ్ ఏర్పడింది. అలా ట్రోల్స్ విషయంలో తాను ఒకింత ఎమోషనల్ కూడా అయ్యి పలు సంచలన కామెంట్స్ చేసాడు. ఇలా కెరీర్లో కొంచెం గ్యాప్ తీసుకొని "క" అనే ఒక యూనిక్ థ్రిల్లర్ తో వచ్చి సెన్సేషనల్ కం బ్యాక్ ని తాను అందుకున్నాడు.

కాగా ఈ సినిమా తర్వాత ఇపుడు దిల్ రుబా అనే సినిమాతో వస్తున్నాడు కానీ ఈ సినిమా తర్వాత చేసే మాస్ చిత్రం "KA ర్యాంప్" అనే మాస్ సినిమా కోసం తాను సిద్ధం అవుతున్నట్టుగా తెలుగు సినీ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ఈ సినిమాలో ఇది వరకు ఎన్నడూ చూడని కిరణ్ అబ్బవరంని ఆడియెన్స్ చూస్తారట. ఇలా తాను 20కి పైగా లిప్ కిస్ సీన్స్ తోనే కాకుండా ఇన్నేళ్ల కెరీర్లో ట్రై చేయని మరో అంశాన్ని కూడా తన నుంచి తాను చూపించనున్నాడట.

అదే ఈ సినిమాకి తాను సిక్స్ ప్యాక్ లుక్ ని కూడా చేస్తాడని తెలుస్తుంది. దీనితో ఈ యువ హీరో మాత్రం తన నెక్స్ట్ సినిమాకి మొత్తం బోల్డ్ వెర్షన్ ని ప్రదర్శించనున్నాడని చెప్పవచ్చు. అయితే తనతో ఆ రేంజ్ లో రెచ్చిపోయే హీరోయిన్ ఎవరు అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. కొన్ని రూమర్స్ అయితే క సినిమా హీరోయిన్ నయన్ సారిక తోనే ఉండొచ్చు అనే వినిపిస్తుంది. ఎవరితో ఈ యంగ్ హీరో ఎక్స్ట్రీమ్ లెవెల్లో రొమాన్స్ చేస్తాడు అనేది వేచి చూడాలి. ఇక హీరోయిన్ పరిస్థితి ఏమిటో అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X