మహిళా దర్శకురాలితో మహేష్ బాబు.. సౌత్ ఇండస్ట్రీపై కన్నేసిన సూపర్ స్టార్
టాలీవుడ్‌లో వరుస విజయాలను సొంతం చేసుకొంటూ అగ్ర దర్శకులతో పనిచేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు భారీగా భవిష్యత్ కార్యచరణతో ముందుకెళ్తున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత సర్కారు వారీ పాటతో బిజీగా ఉన్న మహేష్.. రాజమౌళి సినిమా కోసం సిద్దం అవుతున్నారు. అయితే ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో జోడి కట్టడానికి సిద్ధమవుతున్న సూపర్ స్టార్ మహిళా దర్శకురాలి చిత్రంలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
స్విమ్మింగ్ పూల్‌లో అర్ధనగ్నంగా.. హాట్ హాట్‌గా యువ హీరోయిన్ అందచందాలు
తెలుగులో గురు, తమిళంలో సురారై పోట్రూ (ఆకాశమే నీ హద్దురా)తో భారీ సక్సెస్ అందుకొన్న సుధా కొంగరతో సినిమా చేసేందుకు చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. సుధా, మహేష్ మధ్య కథా చర్చలు జరిగాయి. వ్యక్తిగతంగా కూడా కలుసుకొన్నారు అని ఓ వార్త మీడియాలో వైరల్ అవుతున్నది.

ఇదిలా ఉండగా, మాస్టర్ లాంటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొన్న లోకేష్ కనకరాజ్‌తో కూడా మమేష్ చర్చలు జరిపినట్టు సమాచారం. అయితే ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడంతో ఈ వార్తల్లో వాస్తవం ఎంత అనేది ప్రశ్నార్థకంగా మారింది అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇక సర్కారు వారీ పాట చిత్రం విషయానికి వస్తే గీత గోవిందం చిత్రంతో సక్సెస్ అందుకొన్న పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తీ సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కోవిడ్ కారణంగా ఈ సినిమా షూటింగు పలు సందర్భాల్లో వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











