పెళ్లయిన ఏడాదిలోపే వరుణ్ తేజ్‌కు భారీ సర్జరీ? ఈ మెగా హీరోకి ఏమైందంటే?

మెగా ఫ్యామిలీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మెగా హీరోల్లో చెప్పుకోదగ్గ నటుల్లో వరుణ్ తేజ్ కూడా ఒకరు. ఆయన హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ఇటీవల ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్ళయ్యి ఏడాది కూడా పూర్తి కాకముందే వరుణ్ తేజ్ సర్జరీకి సంబంధించిన ఓ వార్త వైరల్‌గా మారింది. అసలు వరుణ్ కు ఏమైంది అనే విషయంపై ఓ లుక్కేద్దాం.

వరుణ్ తేజ్ సినిమాలు చేస్తున్నా హిట్ పడట్లేదు. రీసెంట్ గా ఆపరేషన్ వాలెంటైన్ అంటూ ప్రేక్షకులను పలకరించాడు. కానీ 40 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా కేవలం 6 కోట్లు మాత్రమే రాబట్టింది. ఎఫ్2 తరువాత వరుణ్ ఖాతాలో ఒక్క హిట్ కూడా పడలేదు.

Is Mega Hero Varun Tej going to under leg Surgery here is the reason

హిట్ లేక కష్టాల్లో ఉన్న వరుణ్ తేజ్ కెరీర్‌కు 'ఆపరేషన్ వాలెంటైన్' మరో డిజాస్టర్‌ని ఇచ్చింది. ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మార్చి 01న థియేటర్లోకి వచ్చింది. టీజర్, ట్రైలర్ కూడా అంచనాలను పెంచేశాయి. కానీ సినిమా ఆడలేదు. ప్రస్తుతం మట్కా అనే మూవీ చేస్తున్నాడు వరుణ్.

ఇదిలా ఉండగా, నాగబాబు తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తోటి నటి లావణ్యను ఇటలీలో వివాహం చేసుకున్నాడు. నటి లావణ్య త్రిపాఠితో వరుణ్ కొన్నాళ్లుగా ప్రేమలో ఉండి, గత ఏడాది జూన్ 09న కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. నవంబర్ 1న వివాహం చేసుకున్నారు. ఈ జంట హనీమూన్‌ కోసం ఆర్కిటిక్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ మెగా కపుల్ తమ సోషల్ మీడియాల్లో హనీమూన్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను పంచుకోగా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు అతడికి సంబంధించిన సర్జరీ విషయం తాజాగా నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.

Is Mega Hero Varun Tej going to under leg Surgery here is the reason

వరుణ్‌కి ఆపరేషన్‌ జరగబోతోందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వరుణ్ తేజ్ కాలికి చిన్న గాయం అయిందని, అది కాస్త పెద్దదైందని, అయితే ట్రీట్మెంట్ చేసినా ఉపయోగం లేకపోవడంతో సర్జరీ చేయాలని డాక్టర్ సూచించినట్టు టాక్ నడుస్తోంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే వార్త హల్‌చల్ చేస్తోంది. దీంతో ఈ వార్తలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ వార్త ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు. మొత్తానికి వరుణ్ తేజ సర్జరీ వార్త వైరల్ గా మారింది. కాగా లావణ్య త్రిపాఠి తరచుగా తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూనే ఉంటుంది. పెళ్లయ్యాక లావణ్య సినిమాలకు దూరంగా ఉంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X