Remuneration: ఓదెల మూవీకి చిరంజీవి రికార్డు రెమ్యునరేషన్.. ఎన్ని కోట్ల పారితోషికమో మీకు తెలుసా?
తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఉన్నన్ని నాళ్ళు గుర్తుండిపోయే బిగ్గెస్ట్ స్టార్స్ పేర్లలో మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా ఉండిపోతుంది. మన తెలుగు సినిమాల్లో ఇన్నేళ్ల జెనరేషన్స్ లో తన కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు ఉన్న హీరోలలో కూడా అప్పటి నుంచి ఇప్పుడు వరకు అదే రేంజ్ స్టార్డంని మైంటైన్ చేస్తూ వచ్చిన వన్ అండ్ ఓన్లీ హీరో మెగాస్టార్ చిరంజీవే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
కాగా తన మార్కెట్ పరంగా కూడా తన తోటి ఉన్న సీనియర్ హీరోస్ లో చూసుకున్నా భారీ మార్జిన్ తో ఇప్పుడుకీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అందుకే మెగాస్టార్ అంటే తెలుగు సినిమాలో సెపరేట్ బ్రాండ్ పడిపోయింది. అలాగని మెగాస్టార్ చేసిన అన్ని సినిమాలు జనం చూస్తున్నారా అంటే ఖచ్చితంగా లేదు. తన నుంచి మంచి కంటెంట్ పడకపోతే ఆ సినిమా దారుణంగా రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.

ఇలా మెగాస్టార్ చిరంజీవి అప్పుడు నుంచి ఇపుడు వరకు తెలుగు సినిమా దగ్గర ఎన్నో రికార్డులు నమోదు చేయగా ఇపుడు కూడా రెమ్యునరేషన్ పరంగా సెన్సేషనల్ రికార్డు సెట్ చేసినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే మన తెలుగు ప్రస్తుత స్టార్ హీరోస్ కి ధీటుగా మెగాస్టార్ ఇప్పుడు ట్రెండ్ లో కూడా సెట్ చేసిన రికార్డులు ఉన్నాయి. అందుకే తనకోసం ఎంతైనా ఇచ్చి నిర్మాతలు సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఇలా తెలుగులో చిరంజీవి రెమ్యునరేషన్ తన నెక్స్ట్ సినిమాకి రికార్డు మార్క్ టచ్ చేసినట్టుగా పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో చేస్తున్న సినిమాకి గాను మెగాస్టార్ ఏకంగా 75 కోట్ల రెమ్యునరేషన్ ని అందుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దీంతో మన తెలుగు సీనియర్ హీరోస్ లో బిగ్గెస్ట్ రికార్డు అయితే యువ స్టార్ హీరోస్ లో కూడా చాలా మంది హీరోస్ రెమ్యునరేషన్ కి కూడా సమానం అని చెప్పొచ్చు.

మరి ఇలా తరాలు మారినా కూడా మెగాస్టార్ క్రేజ్ అండ్ మార్కెట్ మాత్రం చెక్కు చెదరట్లేదనే చెప్పి తీరాలి. ఇక ప్రస్తుతం చిరంజీవి మరో యువ దర్శకుడు వశిష్ఠతో "విశ్వంభర" అనే భారీ ప్రాజెక్ట్ చేస్తుండగా తన కెరీర్ లో చేసిన పలు క్రేజీ సినిమాలు అంజి, జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి ఫాంటసీ సినిమాల తర్వాత చేస్తున్న సినిమా కావడంతో దీనిపై కూడా గట్టి అంచనాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











