దేవదాస్ మూవీ ఆ చిత్రానికి రీమేకా!
శ్రీరామ్ ఆదిత్య దర్శత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం దేవదాస్ సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నాగార్జున, నాని కలసి నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. నాగార్జున దేవాగా డాన్ పాత్రలో కనిపించబోతున్నారు. నాని దాస్ పాత్రలో డాక్టర్ గా కనిపించబోతున్నాడు.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం దేవదాస్ చిత్రం హాలీవుడ్ మూవీ 'అనలైజ్ దిస్' కు రీమేక్ అని నెటిజన్లు అంటున్నారు. అనలైజ్ దిస్ చిత్రం 1999 లో వచ్చింది. దేవదాస్ ట్రైలర్ కు, ఈ చిత్రానికి పోలికలు పెడుతూ సోషల్ మీడియాలో పలు పోస్ట్ లు దర్శనం ఇస్తున్నాయి.

ఈ చిత్రంలో నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ నటిస్తుండగా నాని సరసన సంచలన బ్యూటీ రష్మిక నటిస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని అశ్వినీదత్ నిర్మించారు.
More from Filmibeat
mani sharma chiranjeevi nagarjuna nani devdas sriram aditya rashmika mandanna నాగార్జున నాని దేవ్ దాస్ శ్రీరామ్ ఆదిత్య రష్మిక మందన


Click it and Unblock the Notifications











