1000 మంది ఆర్టిస్టులు.. 10 కోట్ల బడ్జెట్‌తో క్లైమాక్స్.. నందమూరి హీరో మరోసారి రిస్క్ చేస్తున్నాడా?
నందమూరి హీరో కల్యాణ్ రామ్ ఒక సినిమా నుంచి మరో సినిమాకు అంచనాలు పెంచుకొంటూ వెళ్తున్నారు. ఇటీవల కాలంలో హీరోగానే కాకుండా నిర్మాతగా తన సత్తాను చాటుకొంటున్నారు. తొలి సినిమా నుంచి వైవిధ్యమైన కంటెంట్, హైలీ టెక్నాలజీని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తూ సినిమా నిర్మాణం విషయంలో తన తాతకు తగిన మనవడు అనే ఫీలింగ్ కలిగించడంలో సక్సెస్ అయ్యారు. అయితే తాజాగా తన కొత్త సినిమా విషయంలో ఇండస్ట్రీనే కాకుండా ఆడియెన్స్‌కు షాకిచ్చే ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..
కల్యాణ్ రామ్ యాక్టర్‌గా ఎప్పుడూ కొత్తదనం కోసం ప్రయత్నిస్తారనే విషయం తన సినిమాల ద్వారానే చెప్పాడు. ఆయన నటించిన అతనొక్కడే, పటాస్ నుంచి మొన్నటి బింబిసార వరకు కూడా కొత్త దర్శకులను ప్రోత్సాహిస్తూ.. హిట్స్ మీద హిట్స్ కొట్టాడు.

ఇక కొన్ని సినిమాల ద్వారా తెలుగు సినిమాకు కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తూ సినిమాపై తనకు ఉన్న తపనను చాటుకొన్నాడు. కేవలం ప్రొడక్షన్ వ్యాల్యూస్ మాత్రమే కాకుండా నటుడిగా తనలోని ప్యాషన్‌ను బయటపెట్టేందుకు ప్రయత్నిస్తుంటాడనే ఆయన నటించిన సినిమాలు చూస్తే స్పష్టంగా అర్ధం అవుతుంది.
ఇక తాజాగా తన కెరీర్‌లో 21వ సినిమాగా రూపొందుతున్న NKR21 మూవీతో అంచనాలు పెంచుతున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌లో హైరేంజ్ వాల్యూస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేశాడనే చెప్పాలి. తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచే కథ, కథనాలు, ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో సిద్దమవుతున్నాడు.
NKR21 సినిమా కోసం కల్యాణ్ రామ్ చేసిన ప్లాన్ చూస్తే మైండ్ బ్లాంక్ కావాల్సిందే. ఈ సినిమాను మొత్తంగా 1000 కిపైగా ఆర్టిస్టులతో తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ మూవీ కోసం కనివినీ ఎరుగని స్థాయిలో సెట్ వేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ సినిమా క్లైమాక్స్ కోసం సుమారుగా 9 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తున్నది. యాక్షన్, డ్రామాతోపాటు పిరియాడిక్ మూవీగా రూపొందిస్తున్న సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కనివినీ విధంగా ఉంటాయనేది టాక్.
ఇక నిర్మాతగా తన సోదరుడు ఎన్టీఆర్‌తో కలిసి దేవర సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తూ ప్రొడక్షన్ బాధ్యతలను దగ్గరుండి చూసుకొంటున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











