వారాహి యాత్రను ఆపేసి.. పవన్ కల్యాణ్ షూటింగులకు వెళ్తాడా? విమర్శకులకు దిమ్మ తిరిగే జవాబు ఇదే
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గోదావరి జిల్లాలో చేపట్టిన వారాహి విజయ యాత్ర అట్టహాసంగా ప్రారంభించారు. ఈ యాత్రకు అభిమానులు, ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. అన్నవరంలో సత్యదేవుడి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం వారాహి విజయ యాత్రను అభిమానుల కేరింతలు, ఆనందాల మధ్య యాత్రను ప్రారంభించి కత్తిపూడికి చేరుకొన్నారు. ఈ యాత్ర గురించిన వివరాలు, పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్‌ల వివరాల్లోకి వెళితే..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న నాలుగు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. సముద్ర ఖని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్‌తో కలిసి పవన్ కల్యాణ్ బ్రో: ది అవతార్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే డీవీవీ దానయ్య నిర్మాణంలో OG (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలతో బిజీగా ఉన్నారు.

అయితే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో BRO, OG సినిమాల షూటింగ్ ముగించుకొని పవన్ కల్యాణ్ వరాహి విజయ యాత్రను ప్రారంభించారు. అయితే మిగితా రెండు సినిమాల పరిస్థితి ఏమిటనేది అభిమానులు, రాజకీయ నేతల్లో ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఇటీవల జరిగిన ప్రెస్ మీట్‌లో.. పవన్ కల్యాణ్ యాత్రను ఆపేసి షూటింగుల్లో పాల్గొంటారా? అని మీడియా ప్రశ్నించింది.
అయితే మీడియా ప్రశ్నకు నాదెండ్ల మనోహర్ సమాధానం ఇస్తూ.. పవన్ కల్యాణ్ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకొనే ఇండియన్ స్టార్. సినిమాల ద్వారా ఆయన సంపాదించే డబ్బుతోనే పార్టీ నడుస్తున్నది. ఆయన సంపాదించే సొమ్మును పార్టీకి విరాళంగా ఇస్తున్నారు. ఆయన సొంత డబ్బుతోనే పార్టీని నడిపిస్తున్నాడు. కాబట్టి సినిమాలు షూటింగులను, రాజకీయ యాత్రలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తారు అని అన్నారు.

ఇక వారాహి విజయ యాత్ర ప్రారంభానికి ముందు పవన్ కల్యాణ్ నిర్వహించిన యాగానికి హాజరైన టాలీవుడ్ నిర్మాతలు డీవీవీ దానయ్య, ఏఎం రత్నం, వివేక్ కూచిభోట్ల, దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. పవర్ స్టార్ సినిమాల షూటింగులపై క్లారిటీ ఇచ్చారు. మంగళగిరి జనసేన కార్యాలయానికి రావడం ఇదే తొలిసారి. ఇక్కడి వాతావరణం బాగుంది. పవన్ కల్యాణ్ సినిమా షూటింగులు ఇక్కడే చేస్తాం అని అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన షూటింగులు విజయవాడ, మంగళగిరి, గుంటూరు ప్రాంతాల్లో చేస్తాం. ఇక్కడి వాతావరణం చాలా బాగుంది. రాబోయే రోజుల్లో పవన్ కల్యాణ్ ఇక్కడే ఉండబోతున్నారు. ఇక్కడే సెట్స్ వేసి పవన్ కల్యాణ్ సినిమాలను ఆయనకు అనుకూలమైన సమయంలో పూర్తి చేస్తాం అని హరీష్ శంకర్ అన్నారు.


Click it and Unblock the Notifications











