Hari Hara Veera Mallu రిలీజ్ డేట్ ఫిక్స్? పవన్ కల్యాణ్ మూవీ విడుదల ఎప్పుడంటే?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో వస్తున్న హరిహరి వీరమల్లు చిత్రం రిలీజ్‌కు ముందే భారీ అంచనాలను పెంచుతున్నది. 17వ శతాబ్దం నాటి కథా నేపథ్యంతో రూపొందుతున్న చిత్రానికి ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం నిర్మాత. ఈ సినిమాకు బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ షామ్ కౌశల్ ఫైట్స్ సమకూరుస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం, వీఎస్ జీ శేఖర్ సినిమాటోగ్రఫిని అందిస్తున్నారు. అయితే పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ కోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కళ్లు చెదిరే సెట్స్ వేసినట్టు తెలిసింది.
అయితే లాక్‌డౌన్ కారణంగా ఓ వైపు, పవన్ కల్యాణ్ వ్యక్తిగత విషయాల కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదాలు పడుతూ వస్తున్నది. భీమ్లా నాయక్ సినిమా షూట్‌లో పవన్ కల్యాణ్ బిజీగా ఉండటంతో సాయిధరమ్ తేజ్, సముద్రఖనితో మరో సినిమాపై క్రిష్ వర్క్ చేస్తున్నారు. ఈ కారణంగా కూడా హరిహర వీరమల్లు కాస్త లేట్ అయింది. అయితే ఈ పీరియడ్ డ్రామాకు సంబంధించిన షూటింగ్‌ను వచ్చే నెల నుంచి మొదలుపెట్టి పూర్తి చేయాలని దర్శకుడు క్రిష్ ప్లాన్ చేసినట్టు తెలుస్తున్నది. హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన పవన్ కల్యాణ్ పార్టును రెండు వారాలపాటు నిరవధికంగా షూట్ చేయాలని క్రిష్ ఫిక్స్ అయినట్టు సమాచారం. ఈ క్రమంలో ఈ సినిమాపై ఫిలింనగర్‌లో ఓ రూమర్ విస్తృతంగా ప్రచారం అవుతున్నది.

హరిహర వీరమల్లు సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి అక్టోబర్‌లో రిలీజ్ చేయాలని నిర్మాత ఏఎమ్ రత్నం భావిస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమాను థియేటర్‌లో రిలీజ్ చేయాలని దర్శకుడు క్రిష్ ఆలోచిస్తున్నారు. అంతా సవ్యంగా సాగితే దసరాకు హరిహర వీరమల్లు థియేటర్లలో హంగామా చేయడం ఖాయం అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


Click it and Unblock the Notifications











