పవన్ కల్యాణ్ చేతిపై టాటూ.. దాని వెనుక సీక్రెట్ ఏమిటంటే.. పవర్‌స్టార్ ఇమేజ్‌కు భిన్నంగా!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ప్రజల్లో ఎంతో అభిమానం, క్రేజ్ ఉన్నప్పటికీ సాధారణమైన జీవితాన్ని లీడ్ చేయడం అందరికీ తెలిసిందే. సినీతారలకు ఉండే అలవాట్లకు భిన్నంగా పవర్ స్టార్ కనిపిస్తారు. అయితే సింపుల్‌గా కనిపించే పవన్ కల్యాణ్ చేతి మీద టాటూ కనిపించడం అందరిలోనూ ఆసక్తిని రేపింది. ఇంతకు పవన్ కల్యాణ్ చేతి మీద ఉన్న టాటూ ఏమిటంటే...

అర్ధనగ్నంగా హాట్ హీరోయిన్.. బికినీలో దారుణంగా స్కిన్ షో

 ఆకర్షిస్తున్న పవన్ కల్యాణ్ టాటూ

ఆకర్షిస్తున్న పవన్ కల్యాణ్ టాటూ

జనసేన పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ ఇటీవల తన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఆ సమయంలో ఆయన చేతిపై ఉన్న టాటూ అందర్నీ ఆకర్షించింది. పవన్ కల్యాణ్ చేతిపై ఉన్న టాటూ ఏమిటా అని ఆరా తీశారు. అయితే ఆ టాటూ వెనుక అసలు కారణాన్ని ఆయన సన్నిహితులు వివరణ ఇచ్చారు.

పవన్ చేతిపై త్రిశూలం టాటూ

పవన్ చేతిపై త్రిశూలం టాటూ

పవర్ స్టార్ చేతిపై ఉన్న టాటూ త్రిశూలం అని తేల్చారు. త్రిశూలం ఎందుకు వేసుకొన్నారనే విషయం అభిమానుల్లో మరింత ఆసక్తిని రేపింది. మరింత ముందుకెళ్లి ఆరా తీస్తే ఆ టాటూ క్రిష్ జాగర్లమూడి రూపొందించే సినిమా కోసం వేసుకొన్నట్టు అసలు విషయం బయటకు వచ్చింది.

హరిహర వీరమల్లు కోసం

హరిహర వీరమల్లు కోసం

క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించే హరిహరి వీరమల్లు చిత్రం చారిత్రాత్మ నేపథ్యంతో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ కథలో భాగంగా పవన్ పాత్రకు, త్రిశూలం టాటూకు లింక్ ఉందని, అందుకే క్రిష్ త్రిశూలం టాటూను పవన్ చేతిపై వేయించాడని తెలిసింది. ఈ చిత్రంలోని యాక్షన్ సీన్లతో ఈ టాటూ ముడిపడి ఉందనే వార్త కూడా వినిపిస్తుంది.

 17వ శతాబ్దం నాటి కథతో

17వ శతాబ్దం నాటి కథతో

అయితే పవన్ కల్యాణ్ చేతిపై ఉన్న టాటూ నిజంగా హరిహర వీరమల్లు కోసం వేయించుకొన్నదేనా లేక పవన్ మరే కారణంగా వేసుకొన్నారా అనే విషయం సందిగ్ధంగానే ఉంది. 17వ శతాబ్దం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిశూలానికి సంబంధమేమిటనే విషయంపై చిత్ర యూనిట్ వివరణ ఇస్తేనే అసలు విషయం బయటకు వస్తుంది.

Recommended Video

Pawan Kalyan పై బాబు గోగినేని సెటైర్.. మెగా బ్రదర్ ఫైర్!! || Filmibeat Telugu
సంక్రాంతికి రిలీజ్ చేసే విధంగా

సంక్రాంతికి రిలీజ్ చేసే విధంగా

పవన్ కల్యాణ్, క్రిష్ కాంబినేషన్‌లో వస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి స్టంట్ కోరియోగ్రాఫర్‌గా శామ్ కౌశల్ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం ఎంఎం కీరవాణి, సినిమాటోగ్రాఫర్‌గా శేఖర్ వీఎస్ వ్యవహరిస్తున్నారు. అంతా సవ్యంగా సాగితే ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X